India Corona: భారత్లో కొత్తగా 2,61,500 కరోనా కేసులొచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 1,47,88,109కి చేరింది. కొత్తగా 1,501 మంది చనిపోవడంతో... మొత్తం మరణాల సంఖ్య 1,77,150కి చేరింది. దేశంలో మరణాల రేటు 1.2 శాతానికి పెరిగింది. తాజాగా 1,38,423 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 1,28,09,643కి చేరింది. రికవరీ రేటు 86.6 శాతానికి పడిపోయింది. ప్రస్తుతం దేశంలో 18,01,316 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా కొత్తగా 15,66,394 మందికి కరోనా పరీక్షలు చేశారు. భారత్లో ఇప్పటి వరకు 26 కోట్ల 65 లక్షల 38వేల 416 టెస్ట్లు చేశారు. కొత్తగా 26,84,956 మందికి వ్యాక్సిన్ వేశారు. ఇప్పటివరకు 12 కోట్ల 26 లక్షల 22వేల 590 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు. (image credit - twitter)