India Corona: భారత్లో కొత్తగా 2,73,810 కరోనా కేసులొచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 1,50,61,919కి చేరింది. కొత్తగా 1,619 మంది చనిపోవడంతో... మొత్తం మరణాల సంఖ్య 1,78,769కి చేరింది. దేశంలో మరణాల రేటు 1.2 శాతానికి పెరిగింది. తాజాగా 1,44,178 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 1,29,53,821కి చేరింది. రికవరీ రేటు 86 శాతానికి పడిపోయింది. ప్రస్తుతం దేశంలో 19,29,329 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా కొత్తగా 13,56,133 మందికి కరోనా పరీక్షలు చేశారు. భారత్లో ఇప్పటి వరకు 26 కోట్ల 78 లక్షల 94వేల 549 టెస్ట్లు చేశారు. కొత్తగా 12,30,007 మందికి వ్యాక్సిన్ వేశారు. ఇప్పటివరకు 12 కోట్ల 38 లక్షల 52వేల 566 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు. (image credit - NIAID)