పుణెకు చెందిన ఓ జంట అందరినీ ఆశ్చర్యపరిచారు. గతేడాది సెప్టెంబర్లో వీరి వివాహం జరిగింది. కరోనా కాస్త తగ్గుముఖం పట్టిన సమయంలో ఈ వేడుక జరిగింది. photo source Instagram
కాలేజీలో చదివే సమయంలోనే సోషల్ మీడియా ద్వారా ఇద్దరూ ప్రేమించుకున్నారు. మహారాష్ట్ర పద్ధతిలో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే అమ్మాయి మంగళసూత్రం వేసుకున్నప్పుడు తాను కూడా మంగళసూత్రం వేసుకోవాలని అబ్బాయి నిర్ణయించుకున్నాడు. photo source Instagram
ఈ విషయంలో అబ్బాయి అనేక అవమానాలు కూడా ఎదుర్కొన్నాడు. అయితే తమ భర్త బాగుండాలని అమ్మాయిలు మాత్రమే తాళి వేసుకోవడం ఏంటని ? అబ్బాయిలు కూడా తమ భార్య బాగుండాలని ఎందుకు తాళి వేసుకోకూడదని వాదించాడు. photo source Instagram
భార్యాభర్తలు ఇద్దరూ సమానమే అయినప్పుడు అన్ని విషయాలు ఇద్దరికీ వర్తిస్తాయి. అయితే ఈ విషయం బయట తెలిసినప్పుడు యువకుడు అవమానులు ఎదుర్కోవాల్సి వచ్చింది. కొందరు ఈ యువకుడు సంప్రదాయాన్ని, నిబంధనలను తుంగలో తొక్కారని అన్నారు. మరికొందరు ప్రచారం కోసమే ఇవన్నీ చేస్తున్నారని వాదించారు. కానీ ఈ యువకుడు మాత్రం అవన్నీ పట్టించుకోలేదు. photo source Instagram