ఆంధ్రప్రదేశ్ లోని మోడల్ స్కూల్స్ లో అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. 2021-22 విద్యా సంవత్సరంలో 6వ తరగతిలో అడ్మిషన్ల కోసం ప్రకటన విడుదల చేసింది.
ఆంధ్రప్రదేశ్ లోని 164 మోడల్ స్కూల్స్ లో లాటరీ పద్ధతిలో విద్యార్థులకు అడ్మిషన్లు కల్పిస్తున్నారు. అడ్మిషన్ కోసం ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఎలాంటి ఫీజులు లేకుండానే ఇక్కడ బోధన ఉంటుంది.
ప్రవేశ అర్హతలు: వయస్సు: ఒ.సి., బి.సి. (OC,BC) కులాలకు చెందిన విద్యార్ధులు 01-09-2009 మరియ 31-08-2011 మధ్య జన్మించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ (SC, ST) కులాలకు చెందిన విద్యార్ధులు 01-09-2007 మరియు 31-08 -2011 మధ్య జన్మించి ఉండాలి.
సంబంధిత జిల్లాలలో ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో నిరవధికంగా 2019-20 మరియు 2020-21 విద్యా సంవత్సరాల్లో చదివి ఉండాలి. 2020-21 విద్యా సంవత్సరములో 5వ తరగతి చదువుతూ ప్రమోషన్ అర్హత పొంది ఉండాలి.
దరఖాస్తుకు సంబంధించిన పూర్తి సమాచారం www.cse.ap.gov.in/apms.ap.gov.in వెబ్ సైట్ లో అందుబాటులో ఉంటుంది.
దరఖాస్తు చేయు విధానము: అర్హత కలిగిన విద్యార్థులు 16-04-20201 నుండి 15.05.2021 వరకు net banking/credit/debit card లను ఉపయోగించి gate way ద్వారా అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఆ తర్వాత వారికి ఒక జనరల్ నెంబరు కేటాయించబడును. ఆ జనరల్ నెంబరు ఆధారముగా www.cse.ap.gov.in/apms.ap.gov.in ద్వారా ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకొనవలయును.
అప్లికేషన్ ఫీజు వివరాలు: OC మరియు BCలకు రూ. 100/-, SC, ST విద్యార్థులకు రూ.50/- ఆడ్మిషన్లను లాటరీ ద్వారా రిజర్వేషన్ రూల్స్ ప్రకారం కేటాయిస్తారు.