HOME »
PHOTOGALLERY » CORONAVIRUS-LATEST-NEWS »
LOCK DOWN IMPLEMENTATION IN MAHABUBNAGAR DISTRICT VILLAGES VB MBNR
Lockdown in Telangana: నేటి నుంచి 10 రోజుల పాటు స్వచ్ఛంద లాక్ డౌన్.. కీలక షాపులు బంద్.. ఎక్కడంటే..
Lockdown in Telangana: కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతుండటంతో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల్లోని పలు గ్రామాలు స్వచ్ఛందంగా లాక్ డౌన్ పాటించాలని నిర్ణయం తీసుకున్నాయి. దీనికి సంబంధించి గ్రామ పంచాయతీలో తీర్మాణాలను చేశారు.
News18 Telugu | April 26, 2021, 5:43 PM IST
1/ 8
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల్లో కరోనా మహమ్మారి పెరగడంతో పలు గ్రామాలు పది రోజుల పాటు స్వచ్ఛందంగా లాక్ డౌన్ విధించాలని నిర్వహించుకుంటున్నారు. కరోనా కేసులు రోజురోజుకు పెరగడంతో గ్రామపంచాయతీలు స్వచ్ఛందంగా లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 8
పెద్దమందడి మండలంలోని మనందరి తాండా గ్రామ పంచాయతీలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో లో నేటి నుండి స్వచ్ఛందంగా లాక్ డౌన్ అమలు చేసుకుంటున్నట్లు గ్రామ సర్పంచ్ జయంతి ప్రకటించారు. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 8
ఇప్పటికే గ్రామంలో దాదాపు 20 కరోనా కేసులు నమోదు కావడంతో అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె తెలిపారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులను రద్దు చేయాలని, బెల్టుషాపులు... (ప్రతీకాత్మక చిత్రం)
4/ 8
కిరాణా షాపులు, హోటల్ అన్ని వాణిజ్య కార్యకలాపాలు మూసివేయాలని ఆమె అన్నారు. రూల్స్ పాటించని వారికి గ్రామపంచాయతీ రూ.500 జరిమానా విధిస్తామన్నారు. గ్రామ ప్రజలు బాధ్యతగా నడుచుకోవాలని మస్క్ ధరించి, భౌతిక దూరాన్ని పాటించాలని ఆమె అన్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 8
బాలనగర్ మండలం పరిధిలోని కేతిరెడ్డిపల్లి లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేతిరెడ్డిపల్లి లో స్వచ్ఛంద లాక్ డౌన్ ప్రకటించినట్లు సర్పంచ్ రామ్ రెడ్డి తెలిపారు. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 8
గ్రామానికి చెందిన మహిళ కరోనాతో రాత్రి మృతిచెందినట్లు ఆయన తెలిపారు. గ్రామంలో పాజిటివ్ కేసులు అధికంగా ఉన్నాయని ఈ వైరస్ బారిన పాడినవారు ఇళ్లలోనే ఉండేలా పంచాయతీ సిబ్బంది తగిన చర్యలు తీసుకుంటుందని ఆయన తెలిపారు. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 8
స్వచ్ఛందంగా గ్రామంలో లో లాక్ డౌన్ ప్రకటించడంతో గ్రామంలో కరోనా కేసులు తగ్గుముఖం పడతాయన్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
8/ 8
నిత్యావసరాలకు సంబంధించిన షాపులు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు తెరిచి ఉంటాయని వెల్లడించారు. (ప్రతీకాత్మక చిత్రం)