చిన్నా పెద్దా తేడా లేకుండా కరోనా భారిన పడుతున్నారు. జిల్లాలో అధిక కేసులు ప్రధాన పట్టణాలు అయిన విజయనగరం, బొబ్బిలి, పార్వతీపురం, సాలూరు, కురపాం వంటి ప్రాంతాల్లో నమోదవుతున్నాయి. పట్టణాల్లో కోవిడ్ నిబంధనలు పాటించకపోవడం, మార్కెట్, స్కూల్, సినిమా థియేటర్లలో సామాజిక దూరం కనీసం పాటించకుండా ఇష్టానుసారం ప్రజలు తిరగుతుండటంతో కరోనా వ్యాప్తి చెందుతోంది.