• HOME
  • »
  • NEWS
  • »
  • TRENDING
  • »
  • VIDEO OF WOMAN CONSTABLES HALDI CEREMONY BEING HELD AT THE POLICE STATION IS GOING VIRAL IN SOCIAL MEDIA GH SRD

Viral Video : పోలీస్ స్టేషన్‌లోనే మహిళా కానిస్టేబుల్‌కు మంగళస్నానాలు..అంత కరోనా మహిమ..

Viral Video : పోలీస్ స్టేషన్‌లోనే మహిళా కానిస్టేబుల్‌కు మంగళస్నానాలు..అంత కరోనా మహిమ..

Photo Credit : Face Book

Viral Video : రాజస్థాన్‌లోని దుంగార్పూర్ పోలీస్ స్టేషన్లో ఆశా రోత్ అనే మహిళా పోలీసు కానిస్టేబుల్ విధులు నిర్వర్తిస్తున్నారు. మరికొన్ని రోజుల్లో ఆమె పెళ్లి జరగనుంది. కానీ కరోనా నేపథ్యంలో పెళ్లికి ఎక్కువ రోజులు సెలవులు దొరకలేదు.

  • Share this:
కరోనా తరువాత చాలామంది ఉద్యోగులకు ఇంటి నుంచి పనిచేసే అవకాశం వచ్చింది. మహమ్మారి నేపథ్యంలో ప్రైవేటు కంపెనీలతో పాటు ప్రభుత్వ సంస్థలు సైతం ఉద్యోగులకు ఈ అవకాశం కల్పించాయి. కానీ వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు కృషి చేస్తున్న ఫ్రంట్ లైన్ వర్కర్లు మాత్రం ఆరుబయట నిరంతరం విధులు నిర్వర్తించాల్సి వస్తోంది. పోలీసులు, వైద్య సిబ్బందికి సెలవులు దొరికే పరిస్థితులు కూడా లేవు. ఈ నేపథ్యంలో త్వరలో పెళ్లి చేసుకోనున్న ఒక మహిళా కానిస్టేబుల్‌కు పోలీస్ స్టేషన్‌లోనే హల్దీ ఉత్సవాన్ని నిర్వర్తించారు స్టేషన్ సిబ్బంది. ఈ ఘటన రాజస్థాన్‌లోని దుంగార్పూర్ పోలీస్ స్టేషన్‌లో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.రాజస్థాన్‌లోని దుంగార్పూర్ పోలీస్ స్టేషన్లో ఆశా రోత్ అనే మహిళా పోలీసు కానిస్టేబుల్ విధులు నిర్వర్తిస్తున్నారు. మరికొన్ని రోజుల్లో ఆమె పెళ్లి జరగనుంది. కానీ కరోనా నేపథ్యంలో పెళ్లికి ఎక్కువ రోజులు సెలవులు దొరకలేదు. కోవిడ్ కారణంగా పోలీసులు రాత్రి, పగలనే తేడా లేకుండా డ్యూటీ చేయాల్సి వస్తోంది. దీంతో పెళ్లి వేడుకల్లో భాగమైన హల్దీ ఉత్సవాన్ని నిర్వహించే అవకాశం లేకుండా పోయింది. అందువల్ల ఆశా కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్‌లోనే ఈ వేడుకలు చేయాలని భావించారు. ఖాళీ సమయంలో స్టేషన్ సిబ్బంది సాయంతో మొత్తానికి హల్దీ వేడుకలు పూర్తిచేశారు.

* వీడియో వైరల్
ఆశా హల్దీ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాగడ్ దర్శన్ అనే ఫేస్‌బుక్‌ పేజీలో వీటిని షేర్ చేశారు. ఆశా కుటుంబ సభ్యులతో పాటు యూనిఫాంలో ఉన్న మరికొందరు మహిళా పోలీసులు సంప్రదాయం ప్రకారం నవ వధువుకు పసుపు రాశారు. పాటలు పాడుతూ వేడుకను పూర్తి చేశారు. హిందూ వివాహ వేడుకల్లో వధువుకు బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు పసుపు రాసి స్నానం చేయిస్తారు. దీన్నే హల్దీ ఉత్సవం అంటారు. పెళ్లికి ముందు నిర్వహించే ఈ వేడుకలకు హిందువులు ఎంతో ప్రాధాన్యం ఇస్తారు. అందుకే ఆశాకు సెలవు దొరక్కపోయినా, ఖాళీ సమయంలో సంప్రదాయం ప్రకారం వేడుకలు నిర్వహించారు.

* నెలాఖరులో పెళ్లి
కానిస్టేబుల్ ఆశా రోత్ పెళ్లి గత ఏడాది జరగాల్సి ఉంది. కానీ మహమ్మారి కారణంగా వాయిదా పడింది. ఈ ఏడాది పెళ్లికి ముహూర్తం పెట్టుకున్న తరువాత కోవిడ్ రెండో దశ ఉధృతమైంది. దీంతో పెళ్లికి ముందు చేయాల్సిన వేడుకలకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఆమె ఈ నెలాఖరులో పెళ్లి చేసుకోనుంది. తమ జీవితంలో ముఖ్యమైన ఆనందాలకు కరోనా వారియర్స్ దూరం కాకుండా ఉండేందుకు స్టేషన్‌లో హల్దీ వేడుకకు అనుమతులు ఇచ్చినట్టు అధికారులు తెలిపారు.
Published by:Sridhar Reddy
First published:

అగ్ర కథనాలు