POLICE CONSTABLE SUICIDE FOR FRIEND CHEATING IN FINANCIAL MATTERS VRY
Friend Cheating ..ఫ్రెండ్ కోసం ష్యూరిటి.. జీతం రాక కానిస్టేబుల్ ఆత్మహత్య
Friend Cheating ..ఫ్రెండ్ కోసం ష్యూరిటి.. జీతం రాక కానిస్టేబుల్ ఆత్మహత్య
Hyderabad : ఫ్రెండ్ అని నమ్మితే మోసపోయాడు..తన జీతాన్ని తాకట్టు పెట్టి లోన్ ఇప్పిస్తే...నమ్మకం ద్రోహం చేశాడు..దీంతో అటు జీతం రాక ఇటు కుటుంభాన్ని పోషించలేక ఆత్మహత్య చేసుకున్నాడు ఓ కానిస్టేబుల్ .
స్నేహితుడి కోసం ఓ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. అటు స్నేహితుడు ఇటు కుటుంభ సభ్యుల మధ్య నలిగిపోయాడు. అసలు విషయం ఎవరికి చెప్పకుండా తనకు తానే శిక్ష వేసుకున్నాడు. సామరస్యంగా పరిష్కారం అయ్యోదానికి తన ప్రాణాలు వదిలి..తనను నమ్ముకుని వచ్చిన భార్య పిల్లను నట్టేట్లో ముంచి వెళ్లాడు.
వివరాల్లోకి వెళితే..అభిలాష్ నాయక్ మాదన్నపేట పోలీస్ స్టేషన్‌లో గత ఆరు సంవత్సరాలు విధులు నిర్వహిస్తున్నాడు. తల్లిదండ్రులు, భార్యపిల్లలతో కలిసి మూసారం బాగ్‌లోని ప్రభుత్వ క్వార్టర్ లో నివసిస్తున్నాడు. అయితే కొద్ది కాలం క్రితం అభిలాష్ నాయక్ తన స్నేహితుడైన రమెష్ లోన్ తీసుకునేందుకు సహయం చేశాడు. ఇందుకోసం ఓ ఫైనాన్స్ సంస్థకు ష్యూరిటీ పడ్డాడు. అయితే స్నేహితుడు రమెష్ నమ్మక ద్రోహం చేశాడు.
ఫైనాన్స్‌లో తీసుకున్న లోన్ డబ్బులను తిరిగి కట్టేందుకు నిరాకరించాడు. అయితే ఈ విషయం భార్యతోపాటు తల్లిదండ్రులకు తెలియకుండా అభిషేక్ నాయక్ జాగ్రత్త పడ్డాడు. దీంతో వారికి విషయం చెప్పేందుకు ధైర్యం చేయలేదు..దీంతో ఏం చేయాలో తోచకు చనిపోయోందుకు సిద్దపడ్డాడు..అటు స్నేహితుడు మోసం చేయడం ఇటు ఉద్యోగం చేసిన డబ్బులు కూడ చేతికి రాకపోవడంతో ఆర్థిక ఇబ్బందులకు గురయ్యాడు.
ఈనేపథ్యంలోనే తన భార్య పిల్లలను గత శుక్రవారం ఆమె తల్లిగారి ఇళ్లు అయిన కోదాడలో వదిలిపెట్టి వచ్చాడు. అనంతరం రెండు రోజుల పాటు విధుల్లోకి వెళ్లిన అభిషేక్ ఒంటరిగా మరింత మనస్థాపానికి గురయ్యాడు. దీంతో సోమవారం విధులు ముగించుకుని వచ్చి మధ్యహ్నాం లంచ్ చేసిన తర్వాత తన బెడ్ రూంలోకి పడుకున్నాడు. ముందు ప్లాన్ వేసుకున్న ప్రకారమే తన గొంతు కోసుకున్నాడు. చేయిమడమ వద్ద గాట్లు పెట్టకున్నాడు. ఎవరు చూడకపోవడంతో ఆపస్మారక స్థితిలోకి వెళ్లి మృత్యువాత పడ్డాడు..
అయితే రాత్రి పదిగంటలైనా అభిలాష్ నాయక్ బయటకు రాకపోవడంతో వెళ్లి చూసిన సోదరుడికి గదిలోనే రక్తపు మడుగులో పడి ఉన్నాడు. మడుగులోనే శవమై పడి ఉన్నాడు.