NAZIMABAD UNCLE CAME TO THE FUNERAL AND THE SON IN LAW DIED UNABLE TO BEAR IT AUNT DIED IN NIZAMABAD DISTRICT VB
Telangana: మూడు రోజుల వ్యవధిలో ముగ్గురు మృతి.. మామ అంత్యక్రియలకు వచ్చి అల్లుడు మృతి చెందడంతో.. తట్టుకోలేక అత్త..
ప్రతీకాత్మక చిత్రం
Nizamabad: అనారోగ్యంతో మరణించిన మామ అంత్యక్రియలకు వచ్చిన అల్లుడు గుండెపోటుతో మృతి చెందాడు. ఆ విషయాన్ని వాళ్ల అత్తకు తెలియకుండా జాగ్రత్తలు తీసుకున్నా చివరకు ఆమె కు తెలవడంతో భర్త, అల్లుడి మరణాలను తట్టుకోలేక ఆమె కూడా తనువు చాలించింది. ఈ విషాదకర ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.
గత కొన్ని రోజలు నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న మామ ఇటీవల మృతి చెందాడు. అంత్యక్రియలకు బంధువులు అంతా వచ్చారు. కార్యక్రమాలు అయిపోయాయి. ఎవరి ఇళ్లకు వారు వెళ్లిపోయారు. సొంత కూతుళ్లు, కొడుకులు, అల్లుళ్లు మాత్రమే అక్కడ ఉన్నారు. అకస్మాత్తుగా వారి చిన్న కుమార్తె భర్త కు గుండెపోటు రావడంతో ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే చనిపోయాడు. అతడి మృత దేహాన్ని తన సొంత ఊరికి తీసుకెళ్లారు. విషయాన్ని అనారోగ్యంతో బాధపడుతూ.. అప్పటికే భర్త చనిపోయాడనే బాధలో ఉన్న వాళ్ల అత్తకి తెలియకుండా జాగ్రత్త పడ్డారు. యథావిధిగా ఎవరి పనుల్లో వారు ఉండగా.. ఆమెకు విషయం తెలిసింది. దీంతో ఇద్దరి మరణాలను తట్టుకోలేక ఆమె మృతి చెందింది. ఇలా మూడు రోజుల వ్యవధిలో ముగ్గురు తనువు చాలించడంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ హృదయ విదారక ఘటన నిజామాబాద్ జిల్లా లో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం ఇలా ఉన్నాయి..
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం చేపూర్ గ్రామంలో గడ్డం మల్కన్న, మల్కవ్వ దంపతులు నివసిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. అందరికీ పెళ్లిళ్లు కూడా చేశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో మల్కన్న (66) బాధపడుతున్నాడు. అయితే ఇటీ వల మల్కన్న కన్నుమూశాడు. అతని అంత్యక్రియలు కోసం బంధువులు వచ్చారు. కుమార్తెలు, అల్లుళ్లు వచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. అయితే ఇతర కార్యక్రమాల కోసం వాళ్లు ఇక్కడే ఉన్నారు. వారి చన్ని కుమార్తె సాయమ్మ భర్త లక్ష్మణ్(45)కు అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో మృతి చెందారు. విషయం తెసుకున్న సాయమ్మ ఆసుపత్రి తీసుకెళ్తుండగా అప్పటికే మరణించాడు. దీంతో ఆమె బోరున విలపించింది. ఆయన మృతదేహాన్ని స్వగ్రామమైన నిర్మల్ జిల్లా తాండ్రాలకు తీసుకెళ్లారు.
మల్కన్న మృతితో కన్నీరుమున్నీరుగా విలపించిన ఆయన భార్య మల్కవ్వకు అల్లుడి మృతి విషయం తెలియకుండా కుటుంబ సభ్యులు జాగ్రత్తపడ్డారు. మల్కవ్వ కూడా గత కొన్ని రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతుండగా చెబితే ఆమె తట్టుకోలేదని చెప్పలేదు. అయినా ఆమెకు విషయం తెలిసింది. దీంతో మల్కవ్వ(60) బర్త, అల్లుడు మరణాలు తట్టుకోలేక మనస్తాపంతో చనిపోయింది. అయితే మల్కన్న, మల్లవ్వల కుమారుడు గంగాధర్ గతేడాది అనారోగ్యంతో చనిపోయాడు. ఈ విషాదకర ఘటన విన్న ప్రతీ ఒక్కరు కన్నీరు పెట్టుకున్నారు. మల్లవ్వ అంత్యక్రియలకు గ్రామస్తులు రాడానికి ఇష్టపడలేదు. కరోనా కారణంగా భయపడ్డారు. దీంతో ఆమెకు కుటుంబసభ్యులే అంత్యక్రియలు నిర్వహించారు. మూడు రోజుల వ్యవధిలో ఇలా ముగ్గురు చనిపోవడం ఆ చుట్టు పక్కల గ్రామస్తులను కలచివేసింది.