ప్రముఖ ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ సంస్థ బోట్ తన వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా అప్డేటెడ్ టెక్నాలజీతో కొత్త డివైజెస్‌ను విడుదల చేస్తుంది. తాజాగా, ఈ టెక్ దిగ్గజం ‘‘బోట్ ఎక్స్‌ప్లోరర్” పేరుతో బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌వాచ్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. కేవలం రూ. 2,999లకే అద్భుతమైన ఫీచర్లను అందించింది. బడ్జెట్ ధరలోనే దీనిలో ఇంటర్నల్ జిపిఎస్, 24x7 హృదయ స్పందన ట్రాకర్, స్వెట్ రెసిస్టన్స్ వంటి ఫీచర్లను చేర్చింది. ఈ సరికొత్త స్మార్ట్‌వాచ్ విడుదలపై బోట్ కోఫౌండర్ అమన్ గుప్తా మాట్లాడుతూ ‘‘భారతీయ యువతను ఆకట్టుకోవడంలో బోట్ ఎప్పుడూ ముందుంటుంది. యువతను దృష్టిలో పెట్టుకొనే బడ్జెట్ ధరలో బోట్ ఎక్స్‌ప్లోరర్ స్మార్ట్‌వాచ్‌ను విడుదల చేశాం. ఇది పిచ్ బ్లాక్, గ్రే, ఆరెంజ్ ఫ్యూజన్ అనే మూడు పట్టీ రంగులలో అందించబడుతుంది. ప్రస్తుతం రూ.3,000 లోపు మార్కెట్లో లభిస్తున్న మిగతా స్మార్ట్‌వాచ్‌లతో పోలిస్తే ఫిట్నెస్, స్టైల్, పర్సనలైజేషన్ పరంగా ఇది అద్భుతంగా పనిచేస్తుంది." అని అన్నారు.
Samsung Galaxy A32: ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.3,000 తగ్గింది... రూ.1,500 డిస్కౌంట్ కూడా
LG Wing: ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.40,000 తగ్గింది... లేటెస్ట్ రేట్ ఎంతంటే
అద్భుతమైన ఫీచర్లు
బోట్ ఎక్స్‌ప్లోరర్ స్మార్ట్ వాచ్‌లో పర్ఫార్మెన్స్, డిజైన్ పరంగా అద్భుతమైన ఫీచర్లను జోడించింది. ఇది పర్సనలైజ్డ్ క్లౌడ్ వాచ్ ఫేస్‌లను అందిస్తుంది. దీనిలో చదరపు ఆకారంలో గల డయల్ మెటల్ బాడీ, 5ATM స్వెట్, వాటర్ రెసిస్టన్స్ వంటివి అందించింది. డిజైన్ పరంగా చూస్తే, ఈ వాచ్‌కు సిలికాన్ పట్టీలు, క్లౌడ్ వాచ్ ఫేసెస్, UI కంట్రోలింగ్ సైడ్-మౌంటెడ్ క్రౌన్ వంటి ఫీచర్లను జోడించింది. ఇది 240x240 పిక్సెల్స్ స్క్రీన్ రెజల్యూషన్ గల1.3 -అంగుళాల హెచ్డీ కలర్ టచ్ డిస్ప్లేను అందిందింది. అంతేకాక, డౌన్లోడెబుల్ క్లౌడ్ బేస్డ్ వాచ్ ఫేసెస్, బ్లూటూత్ 4.2 వైబ్రేషన్ అలర్ట్స్, హార్ట్ రేట్ ట్రాకింగ్, వెల్నెస్ మోడ్, స్లీప్ హార్ట్ రేట్, మెనుస్ట్రుయేషన్ సైకిల్ ట్రాకర్ వంటి అద్భుతమైన ఫీచర్లను చేర్చింది. వీటితో పాటు రన్నింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్ వంటి ఎనిమిది స్పోర్ట్స్ మోడ్లలో ఇది పనిచేస్తుంది. ఈ 8 మోడ్ల ద్వారా మీ పర్ఫార్మెన్స్ను ట్రాక్ చేయవచ్చు. అదే విధంగా సంగీతాన్ని నియంత్రించవచ్చు, కాల్స్, సోషల్ మీడియా మెసేజెస్ అలర్ట్స్‌ను స్వీకరించవచ్చు. ఇక, బ్యాటరీ పరంగా చూస్తే బోట్ ఎక్స్ప్లోరర్లో 210mAh బ్యాటరీని అందించింది. ఇది మాగ్నెటిక్ ఛార్జింగ్‌తో పనిచేస్తుంది. దీన్ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 7 నుండి 10 రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్ అందిస్తుంది. అంతేకాక, 30 రోజుల వరకు స్టాండ్‌బై సమయాన్ని ఇస్తుంది. కనెక్టివిటీ ఫీచర్ల పరంగా చూస్తే దీనిలో బ్లూటూత్ 4.2, ఇన్‌బిల్ట్ GPS సెన్సార్ సపోర్ట్‌ను అందించింది.
Poco X3 Pro: రూ.18,999 విలువైన స్మార్ట్‌ఫోన్ ఎక్స్ఛేంజ్ ఆఫర్‌తో రూ.2,499 ధరకే కొనండి ఇలా
WhatsApp: మీరు వాట్సప్ గ్రూప్ అడ్మిన్‌గా ఉన్నారా? ఈ కొత్త ఫీచర్ మీకోసమే
ధర, లభ్యత
భారత మార్కెట్లో బోట్ ఎక్స్‌ప్లోరర్‌ను కేవలం రూ. 2,999లకే అందుబాటులోకి తెచ్చింది. దీని అమ్మకాలను బోట్ అధికారిక వెబ్సైట్, ఫ్లిప్‌కార్ట్ ద్వారా ప్రారంభించింది. ఈ స్మార్ట్‌వాచ్‌పై ఒక సంవత్సరం పాటు వారంటీని కూడా అందిస్తుంది.