IPL 2021 ENGLAND WOMAN CRICKETER KATE CROSS POSTED A SELFIE AND THANKED CSK AFTER RECEIVING JERSEY FROM DHONIS TEAM SRD
IPL 2021 : ఇంగ్లండ్ మహిళా క్రికెటర్ కు సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన CSK..ఏంటో తెలుసా..?
IPL 2021 : ఇంగ్లండ్ మహిళా క్రికెటర్ కు సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన CSK..ఏంటో తెలుసా..?
IPL 2021 : గత సీజన్ మినహాయిస్తే.. ప్రతి ఏడాది కూడా చెన్నై సూపర్ కింగ్స్ సూపర్ షో చేస్తూనే ఉంది. ముంబై ఇండియన్స్ తర్వాత.. అత్యంత పాపులారిటీ ఉన్న టీమ్ కూడా చెన్నై సూపర్ కింగ్స్ నే. ప్రపంచవ్యాప్తంగా చెన్నై కు బోలెడంత మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఈ లిస్ట్ లో పలువురు విదేశీ క్రికెటర్లు కూడా ఉన్నారు.
అంతా అనుకున్నట్లే జరిగింది. కరోనా ఎఫెక్ట్ ఐపీఎల్ 2021 సీజన్ వాయిదా పడింది. వరుసగా కరోనా కేసులు రావడంతో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే, లీగ్ జరిగినంత వరకు ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, ముంబై టీమ్ లు అదరగొట్టాయ్. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ ఆల్ రౌండ్ షో అదరగొట్టింది. గతేడాది పాయింట్ల టేబుల్ ఏడో స్థానంలో నిలిచిన ధోనీసేన.. ఈ సీజన్ వాయిదా పడకముందు ఐదు విజయాలతో రెండో స్థానంలో నిలిచింది. గత సీజన్ మినహాయిస్తే.. ప్రతి ఏడాది కూడా చెన్నై సూపర్ కింగ్స్ సూపర్ షో చేస్తూనే ఉంది. ముంబై ఇండియన్స్ తర్వాత.. అత్యంత పాపులారిటీ ఉన్న టీమ్ కూడా చెన్నై సూపర్ కింగ్స్ నే. ప్రపంచవ్యాప్తంగా చెన్నై కు బోలెడంత మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఈ లిస్ట్ లో పలువురు విదేశీ క్రికెటర్లు కూడా ఉన్నారు. ఇంగ్లండ్ మహిళా క్రికెటర్ కేట్ క్రాస్ కూడా చెన్నై సూపర్ కింగ్స్ టీమ్‌కు పెద్ద అభిమాని. సీఎస్‌కే అంటే విపరీతమైన అభిమానం చూపించే కేట్‌కు సీఎస్‌కే ఓ సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చింది. కేట్‌కు చెన్నై ఫ్రాంఛైజీ ప్రత్యేక జెర్సీని పంపింది. సీఎస్‌కే జెర్సీని అందుకున్న కేట్.. దానిని ధరించి తన ట్విటర్‌లో షేర్ చేసింది. అంతేకాదు చెన్నైకి కృతజ్ఞతలు తెలిపింది. 29 ఏళ్ల కేట్ ఇంగ్లండ్ తరఫున 3 టెస్టులు, 28 వన్డేలు, 13 టీ20లు ఆడింది.
" మీ అభిమానానికి థ్యాంక్స్ చెన్నై. మీరు పంపిన జెర్సీని ఇప్పుడే వేసుకున్నా. సీఎస్‌కే జెర్సీపై 16 నెంబర్ కేటాయించడం నాకు సంతోషంగా అనిపించింది. కానీ కరోనా పరిస్థితుల వల్ల ఐపీఎల్ 2021 రద్దు కావడం బాధ కలిగించింది. అయితే బీసీసీఐ మంచి నిర్ణయమే తీసుకుంది. ఆట కంటే ముందు ప్రాణాలు ముఖ్యం. పరిస్థితులు చక్కబడి మళ్లీ లీగ్ ఆరంభిస్తే చూడాలని ఉంది" అంటూ ఇంగ్లీష్ బౌలర్ కేట్ క్రాస్ క్యాప్షన్ జత చేసింది. దేశంలో విలయం సృష్టిస్తున్న కరోనా.. ఐపీఎల్‌ను కూడా తాకడంతో అప్రమత్తమైన బీసీసీఐ టోర్నీని అర్ధంతరంగా నిలిపివేసింది. 14 ఏళ్ల లీగ్ చరిత్రలో ఇలా మధ్యంతరంగా ముగియడం ఇదే తొలిసారి.
ఇక, ధోనీసేనలోనూ కరోనా కలకలం రేపిన సంగతి తెలిసిందే. బౌలింగ్ కోచ్ లక్ష్మీపతి బాలాజీకి కరోనా పాజిటివ్‌గా తేలగా.. తాజాగా ఆ జట్టు బ్యాటింగ్ కోచ్ మైక్ హస్సీ కూడా కరోనా బారీన పడ్డాడు. మొదటగా బాలాజీకి వైరస్ సోకింది. దీంతో జట్టంతా వారం రోజుల కఠిన క్వారంటైన్‌కు వెళ్లింది. కానీ బాలాజీ వైరస్ సోకిన మరుసటి రోజే హస్సీకీ పాజిటివ్ రావడం కలకలం సృష్టించింది. ఈ ఫలితానికి రెండు రోజుల ముందు ఆయన సురేశ్ రైనా, ఫాఫ్ డుప్లెసిస్‌తో 15-20 నిమిషాలు మాట్లాడాడు. అంతేకాకుండా మరికొందరు ఆటగాళ్లతోనూ చర్చించాడని సమాచారం. దీంతో చెన్నై జట్టులో మరింత మందికి పాజిటివ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఆ జట్టులో కలవరం రేగింది. ఇప్పటికే.. క్రికెటర్లు తమ ఇళ్లకు పంపించేందుకు బీసీసీఐ అన్ని ఏర్పాట్లను చేసింది.