• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • BIG SHOCK TO TDP BEFORE TIRUPATI BY POLL ATCHANNAIDU HOT COMMENTS ON LOKESH VIDEO VIRAL NGS

Andhra Pradesh: ఆయనే బాగుంటే ఈ దుస్థితి వచ్చేదా? లోకేష్ తో తనది విడదీయని బంధమన్న అచ్చెన్న

Andhra Pradesh: ఆయనే బాగుంటే ఈ దుస్థితి వచ్చేదా? లోకేష్ తో తనది విడదీయని బంధమన్న అచ్చెన్న

లోకేష్ ది తనది విడదీయని బంధం

నారా లోకేష్ కారణంగానే టీడీపీకి వరుస ఓటములు ఎదురవుతున్నాయా? ఆయన వల్లే నేడు పార్టీకి ఈ దుస్థితి వచ్చిందా? ఇలా అన్నది ప్రత్యర్థి పార్టీ నేతలు కాదు. స్వయంగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడే. అయితే ఆ వీడియోపై అచ్చెన్న ఘాటుగా స్పందించారు. లోకేష్ తో తనది విడదీయని బంధమని వివరణ ఇఛ్చారు? ఇంతకీ ఏది నిజం.

  • Share this:
    తిరుపతి ఉప ఎన్నిక ముందు టీడీపీకి ఊహించని షాక్ తగిలింది. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడి వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. అందులో టీడీపీ జాతీయ కార్యదర్శి లోకేష్ ను ఉద్దేశిస్తూ.. ఆయనే సరిగా ఉంటే పార్టీకి ఈ దుస్థితి వచ్చేది కాదని.. పార్టీ లేదు ఏమీ లేదంటూ అచ్చెన్నాయుడి వ్యాఖ్యలు అందులో క్లియర్ గా వినిపిస్తున్నాయి. దీంతో ప్రస్తుతం ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

    ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు మరో టీడీపీ నేతకు మధ్య జరిగిన సంభాషణ వీడియో అది. పార్టీ కేడర్ ను చంద్రబాబు, లోకేష్ వాడుకుని వదిలేస్తున్నారని.. ఆ టీడీపీ నేత అచ్చెన్నాయుడి ముందు గోడు వెల్లబోసుకున్నాడు. తండ్రీ కొడుకులు ప్రవర్తిస్తున్న తీరుపై ఆయన మండిపడ్డారు. తనకు పార్టీలో అన్యాయం జరిగిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. బ్రదర్ అంటూ ఒకప్పుడు మాట్లాడే లోకేష్.. ఇప్పుడు కూర్చో అమ్మా అంటూ మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని. పార్టీ కోసం 30 ఏళ్లు కష్టపడ్డ తనకు అన్యాయం చేశారంటూ ఆవేశపూరితంగా మాట్లాడారు. మొదట సర్ధి చెప్పేందుకు ప్రయత్నించిన అచ్చెన్నాయుడు మధ్యలో కలుగచేసుకుని. లోకేష్‌ను‌ ఉద్దేశించి ఆయనే సరిగా ఉంటే పార్టీకి ఈ దుస్థితి వచ్చేది కాదని వ్యాఖ్యానించారు. తరువాత పార్టీ లేదు.. ఏమి లేదంటూ ఆ టీడీపీ నేతకు వత్తాసు పలికారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

    అయితే ఈ వీడియోపై అచ్చెన్నాయుడు ఘాటుగా స్పందించారు. టీడీపీ యువ నాయకుడు లోకేష్‌తో తనకున్న అనుబంధాన్ని ఎవరూ విడదీయలేరన్నారు. తిరుపతి ఉప ఎన్నికలో అధినేత చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఐకమత్యంతో పనిచేస్తున్నామని, జగన్‌కు ఓట‌మి భ‌యం పట్టుకుందని.. అందుకే ఇలాంటి అబద్దపు వీడియోలను ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వివేకా హత్యపై నారా లోకేష్ విసిరిన స‌వాల్‌కి తోక‌ ముడిచిన జగన్.. ఆ పార్టీ లీడర్లు చవుకబారు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.

    తిరుపతి ఉప ఎన్నికలో వైసీపీకి ఓటమి భయం పట్టుకోవడంతోనే ఇలాంటి డ్రామాలకు తెరలేపారని మండిపడ్డారు. సోమవారం చంద్రబాబు స‌భ‌పై రాళ్లేయించారని, ఇప్పుడు తన సంభాష‌ణ‌ల్ని వ‌క్రీక‌రించారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. తన సొంత ఛానళ్ల ద్వారా ఎన్ని త‌ప్పుడు‌ వీడియోలు వేసినా టీడీపీలో విభేదాలు సృష్టించ‌లేరని జగన్ పై మండిపడ్డారు. ఎన్ని విష‌ ప‌న్నాగాలు ప‌న్నినా టీడీపీ విజ‌యాన్ని ఆప‌లేరిని అచ్చెన్న ఫైర్ అయ్యారు.

    మరోవైపు సోమవారం టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఎన్నికల ప్రచార సభలో రాళ్ల దాడి ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు రాళ్ల దాడి జరిగినట్టు ఎలాంటి ఆధారాలు లేవన్నారు. ఏవైనా ఆధారాలు ఉంటే చూపాలనే టీడీపీ నేతలకు నోటీసులు ఇచ్చామని పోలీసులు అంటున్నారు.

    వైసీపీ మంత్రులు కూడా ఈ వీడియోపై స్పందించారు. అచ్చెన్నాయుడు చెప్పిన మాట వందకు వంద శాతం నిజమనన్నారు మంత్రి బొత్సా సత్యనారాయణ. పార్టీ పరిస్థితి ఇలా ఉంది కాబట్టే.. తిరుపతి ఉప ఎన్నికలో టీడీపీకి డిపాజిట్ కూడా రాదన్నారు బొత్స.
    Published by:Nagesh Paina
    First published:

    అగ్ర కథనాలు