NO MASK VIDEO DELHI POLICE PERSONNEL REMAINED CALM DESPITE THE WOMAN MISBEHAVING WITH THEM WATCH VIRAL VIDEO NK
No Mask Video: మాస్క్ లేకుండా యువతి... పోలీసులతో గొడవ... ఏం చేస్తారు అంటూ ఫైర్
మాస్క్ లేకుండా యువతి... పోలీసులతో గొడవ... ఏం చేస్తారు అంటూ ఫైర్ (image credit - twitter)
No Mask: మాస్క్ లేకుండా తిరగవద్దని ఎంతలా మొత్తుకుంటున్నా... కొంత మంది మాస్క్ వాడట్లేదు. పైగా పోలీసులపైనే రివర్స్ అవుతున్నారు. ఆ యువతి చేసిన హంగామా వైరల్ అయ్యింది.
No Mask: దేశంలో కరోనా విపరీతంగా పెరిగిపోతోందని మనమంతా ఎంతో ఆందోళన చెందుతున్నాం. బయటకు వెళ్లినప్పుడు మాస్క్ వాడుతున్నాం. కానీ ఆ భార్యాభర్తలు ఇద్దరూ మాస్క్ లేకుండా కారులో వెళ్తూ కనిపించారు. కారులోనైనా మాస్క్ పెట్టుకోవాల్సిందే అని కోర్టు ఈమధ్యే ఆదేశించింది. కానీ వాళ్లు ఆ రూల్ పాటించట్లేదు. దీనిపై పోలీసులు ప్రశ్నిస్తే... పోలీసులపైనే రివర్స్ అయ్యారు. ఢిల్లీలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆశ్చర్యకరమైన విషయమేంటంటే... ఆమె పోలీసులంటే ఏమాత్రం రెస్పెక్ట్ లేకుండా... ఇష్టమొచ్చినట్లు వాళ్లపై రివర్స్ అవుతుండటమే.
ప్రస్తుతం ఎక్కువ కరోనా కేసులున్న రాష్ట్రాల్లో ఢిల్లీ కూడా ఉంది. అక్కడ రోజూ 8వేలకు పైగా కొత్త కేసులు వస్తున్నాయి. కరోనాను ఎలా కంట్రోల్ చెయ్యాలో అర్థం కాక... అక్కడి సీఎం కేజ్రీవాల్ తలపట్టుకుంటున్నారు. కానీ ఇలాంటి యూత్ రూల్స్ పాటించట్లేదు. కారులో వాళ్లు వెళ్తున్నది ఏ నిత్యవసరాలో కొనుక్కోవడానికి కాదు. సరదాగా షికారుకు తిరుగుతున్నారు. ఇప్పుడు షికార్లు తిరిగే టైమా... కరోనా కాలం. ఢిల్లీలో వీకెంట్ లాక్డౌన్ ఉంది. అందువల్ల పోలీసులు ఆ జంటను ఆపి... బయటకు ఎందుకొచ్చారు... మాస్క్ ఎందుకు పెట్టుకోలేదు అని అడిగారు. అంతే... ఆమె భర్త కంటే ఆమె ఎక్కువగా పోలీసులపై రివర్స్ అయ్యింది.
With such boorish, uncouth #COVIDIOTS , expect #COVID19 cases to rise in Delhi. People aren't willing to learn. @DelhiPolice personnel remained calm despite the woman in video misbehaving with them. 👇 pic.twitter.com/MMDe54CLJ5
"అవును... నేను మాస్క్ పెట్టుకోలేదు. ఎవరు పెట్టుకుంటున్నారు. మీకేంటి... నా ఇష్టం... ఇప్పుడు నా భర్తకు ముద్దు ఇస్తాను. ఆపుతావా" అంటూ ఆమె పోలీసులతో అసభ్యంగా మాట్లాడటం ఇప్పడు దేశం మొత్తం చూస్తోంది. ఆ జంటను తిట్టిపోస్తోంది. ఆ వీడియో చూస్తే మీకూ ఆమెపై కోపం రావడం ఖాయం.
దర్యాగంజ్ ప్రాంతంలో ఇది జరిగినట్లు తెలిసింది. పోలీసులు ఈ జంటపై FIR నమోదు చేశారు. ఆమెకు కౌన్సెలింగ్ ఇవ్వాలి రమ్మంటే... ఆమె రానంది. విదేశాల్లో పోలీసులంటే ప్రజలు విపరీతంగా భయపడతారు. అక్కడి పోలీసులు... తాము చెప్పినట్లు ప్రజలు వినకపోతే... క్షణాల్లో కాల్చి చంపుతారు. అలాంటి ఫైరింగ్ పర్మిషన్లు వారికి ఉంటాయి. మన దేశంలో పోలీసులను చాలా మంది లెక్క చెయ్యరు. బుద్ధిగా మంచి విషయాలు చెబితే... ఇదిగో ఇలా రివర్స్ అవుతారు. ఈ వీడియోని చూసిన నెటిజన్లు... ఆమెను జైల్లో పెట్టాలని కోరుతున్నారు.