payal rajputh: టాలీవుడ్ గ్లామర్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ గురించి అందరికీ తెలిసిందే. ఆర్ ఎక్స్ 100 సినిమా ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అయింది. ఈ సినిమాలో తన నటనతో ఎంతో గుర్తింపు తెచ్చుకున్న పాయల్ రాజ్ పుత్.. తొలిసారి నటనతో యువత మనసులను దోచుకుంది. అంతేకాకుండా తన అందంతో అందర్నీ ఆకట్టుకుంది. అతి తక్కువ సమయంలో ఓవర్ నైట్ హీరోయిన్ గా పేరు సొంతం చేసుకుంది.
2017 లో పంజాబీ సినిమా ద్వారా సినీ పరిశ్రమకు పరిచయం కాగా.. ఈ సినిమాతో తన నటనతో ఉత్తమ నటి అవార్డు సొంతం చేసుకుంది. తర్వాత 2018 లో ఆర్ఎక్స్ 100 సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఇక వెంకీ మామ సినిమాలో, డిస్కో రాజా సినిమాలో నటించిన అంత సక్సెస్ ను అందుకోలేకపోయింది. ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.
అంతేకాకుండా ఆ మధ్య సోషల్ మీడియాలో తన చిన్ననాటి స్నేహితుడు సౌరభ్ డింగ్రాతో ప్రేమాయణం లో ఉన్నట్లు చెప్పగా.. ఈ విషయం బాగా వైరల్ గా మారింది. ఇక తాజాగా తన బాయ్ ఫ్రెండ్ సౌరభ్ సోషల్ మీడియాలో అభిమానులతో తెగ ముచ్చటించగా.. ఓ నెటిజన్ ఏకంగా అతడినే పాయల్ ఫోన్ నెంబర్ అడిగాడు. దీంతో అతడు పాయల్ను ట్యాగ్ చేసి.. ఈ ప్రశ్నకు సమాధానం ఆమె చెబితే బాగుంటుందని అనగా.. వెంటనే పాయల్ ఈ విషయం పై స్పందిస్తూ.. పోలీస్ కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్ 100 అని సమాధానం ఇచ్చింది. వెంటనే ఆ నెటిజన్ ఈ నెంబర్ చూసి షాక్ అవ్వగా.. పాయల్ పై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.