NHAI DEPUTY MANAGER RECRUITMENT 2021 APPLICATIONS INVITED FOR 41 VACANCIES HERE FULL DETAILS NS
NHAI Recruitment 2021: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. NHAIలో ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే..
ప్రతీకాత్మక చిత్రం
నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. పలు ఉద్యోగాల భర్తీకి సంస్థ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
అర్హతల వివరాలు..
మొత్తం 41 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో తెలిపారు. గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా సంస్థ నుంచి సివిల్ ఇంజనీరింగ్ లో డిగ్రీ చేసిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునేందుకు అర్హులని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. ఫైనల్ సెమిస్టర్ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అవకాశాన్ని కల్పించారు. ఈ ఉద్యోగాలకు వయోపరిమితిని 30 ఏళ్లుగా నిర్ణయించారు. అప్లికేషన్లకు ఆఖరి తేదీగా నిర్ణయించిన మే 28 నాటికి 30 ఏళ్ల వయస్సు దాటిన అభ్యర్థులు అప్లై చేసుకునేందుకు అనర్హులని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. Official Web Site - Direct Link Official Notification - Direct Link
అభ్యర్థుల ఎంపిక..
GATE 2021లో సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో అభ్యర్థులు సాధించిన స్కోర్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుందని నోటిఫికేషన్లో తెలిపారు. అవసరమని భావిస్తే అభ్యర్థులకు ఇంటర్వ్యూలను కూడా నిర్ణయించే అధికారం NHAI కు ఉంటుంది. కట్ ఆఫ్ మార్కులను కూడా NHAI నిర్ణయిస్తుంది. అభ్యర్థులు ఇతర పూర్తి వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు.