HEALTH ASSISTANT AND HIS EIGHT YEARS OLD SON DIED IN ROAD ACCIDENT AND THE INCIDENT HAPPEND IN VISAKHAPATNAM DISTRICT SSR
Accident: ఇలా జరుగుతుందని పాపం అతనికి మాత్రం ఏం తెలుసు.. 8 ఏళ్ల కొడుకుతో కలిసి వెళుతుండగా...
ఘటనా స్థలిలో పడి ఉన్న గీతం, రవికుమార్, ఇన్‌సెట్‌లో రవికుమార్ ఫైల్ ఫొటో
రోజూలానే మంగళవారం కూడా విధులకు వెళ్లేందుకు బైక్‌పై బయల్దేరాడు. అయితే.. వెళ్లే దారిలో తన కొడుకు గీతం(8)ను చింతపల్లిలో ఉన్న తన తల్లి దగ్గర వదిలివెళ్లాలని భావించాడు. ఆ ఎనిమిదేళ్ల పిల్లాడిని కూడా బైక్‌పై ఎక్కించుకుని బయల్దేరాడు.
విశాఖ: విశాఖ జిల్లాలోని చింతపల్లిలో జరిగిన రోడ్డు ప్రమాదం ఓ కుటుంబంలో విషాదం నింపింది. రోడ్డు ప్రమాదంలో హెల్త్ అసిస్టెంట్, అతని ఎనిమిదేళ్ల కొడుకు స్పాట్‌లోనే చనిపోయారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. గూడెంకొత్త వీధి మండలం జర్రెల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఉన్న చౌడుపల్లి ఉప కేంద్రంలో ఎం.రవికుమార్(40) హెల్త్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. ఇతను.. కుటుంబంతో కలిసి నర్సీపట్నంలో నివాసం ఉంటూ అక్కడి నుంచి రోజూ విధులకు హాజరవుతున్నాడు. రోజూలానే మంగళవారం కూడా విధులకు వెళ్లేందుకు బైక్‌పై బయల్దేరాడు. అయితే.. వెళ్లే దారిలో తన కొడుకు గీతం(8)ను చింతపల్లిలో ఉన్న తన తల్లి దగ్గర వదిలివెళ్లాలని భావించాడు. ఆ ఎనిమిదేళ్ల పిల్లాడిని కూడా బైక్‌పై ఎక్కించుకుని బయల్దేరాడు. కొడుకుతో కలిసి సరదగా ముచ్చటిస్తూ బైక్‌పై వెళుతుండగా.. చింతపల్లి-నర్సీపట్నం ప్రధాన రహదారి మడిగుంట గ్రామ సమీపంలోని మలుపు దగ్గర.. ఎదురుగా వస్తున్న ఓ వ్యాన్ వీరి బైక్‌ను ఢీ కొట్టింది. వ్యాన్ ఢీ కొట్టడంతో బైక్‌పై నుంచి తండ్రీకొడులిద్దరూ కింద పడ్డారు. ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. రవికుమార్ హెల్మెట్ ధరించి ఉన్నప్పటికీ తలకు బలమైన గాయమైంది. సుమారు అరగంట పాటు ఘటనా స్థలంలోనే కొన ప్రాణాలతో ఈ ఇద్దరూ కొట్టుమిట్టాడారు. ఇద్దరూ ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. బైక్‌ను ఢీకొట్టిన వ్యాన్ డ్రైవర్ ఆపకుండా వెళ్లిపోయాడు. అయితే.. నర్సీపట్నం దగ్గరలోని గబ్బాడ గ్రామ సమీపంలో వ్యాన్ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
రవికుమార్‌కు భార్య, నాలుగేళ్ల వయసున్నమరో కుమారుడు ఉన్నట్లు తెలిసింది. రవికుమార్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన గత 15 ఏళ్లుగా హెల్త్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. రోజూలానే విధులకు వెళ్లి తిరిగి వస్తాడని భావించిన అతని తల్లిదండ్రులు, భార్య ఊహించని ఈ పరిణామంతో షాక్‌కు లోనయ్యారు. రోజూ కళ్ల ముందు ఆడుతూపాడుతూ కనిపించే గీతం కూడా ఇక లేడన్న వార్త ఆ కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచెత్తింది. గ్రామంలో అందరితో మంచిగా ఉంటూ.. అందరినీ కలుపుకుపోతూ చేతనైన సాయం చేసే రవికుమార్ మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
రవికుమార్, గీతం మృతదేహాలకు పోస్ట్‌మార్టం నిర్వహించిన అనంతరం కుటుంబ సభ్యులకు వారి మృతదేహాలను అప్పగించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని, వ్యాన్ డ్రైవర్ నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.