ఏపీ వ్యాప్తంగా కఠినంగా కర్ఫ్యూ కొనసాగుతోంది. మధ్యాహ్నం 12 గంటల నుంచే అన్ని బంద్ అయ్యాయి. రోడ్లు అన్నీ నిర్మాణుష్యంగా మారాయి. అంతరాష్ట్ర సరిహద్దులు సైతం మూతపడ్డాయి. సరిగ్గా 12 గంటల నుంచే షాపులు, హోటల్స్, మాల్స్, కార్యాలయాలు అన్నీ చాలా వరకు మూసివేశారు. అక్కడక్కడ అవగాహన లేక కొంతమంది తెరిచి ఉంచినా పోలీసులు అక్కడకు చేరుకుని వాటిని మూయించి వేశారు. మరోవైపు 12 దాటిన తరువాత రోడ్లపైకి వచ్చిన ప్రజలను సైతం పోలీసులు తీవ్రంగా మందలించారు. తొలి తప్పుగా వదిలేస్తున్నామని.. రెండోసారి మధ్యాహ్నం 12 గంటలు దాటిన తరువాత కనిపిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించి వెనక్కు పంపేస్తున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా కఠిన ఆంక్షలు అమలు అవుతూనే ఉన్నాయి. అయినా కొందరు మాత్రం నిర్లక్ష్యం వీడడం లేదు. పోలీసులు కల్లుకప్పి తప్పించుకు తిరగాలని ప్రయత్నిస్తున్నారు. సాధారణంగా అత్యవసరాలు, నిత్యావసర సరుకులు కొనుగోలు చేసుకునేందుకు ప్రభుత్వం ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అనుమతి ఇచ్చింది. అయినా చాలామంది నిర్లక్షంగా వ్యవహరిస్తూనే ఉన్నారు.
అసలే ఏపీ వ్యాప్తంగా కోరనా తీవ్రంగా విస్తరిస్తోంది. రోజు రోజుకూ కేసులు రెట్టింపు అవుతున్నాయి. ఊహించని స్థాయిలో కరోనా కేసులతో పాటు, మరణాలు కూడా పెరగడం కలవర పెడుతోంది. ఇలాంటి సమయంలో మరిన్ని జాగ్రత్తలు పాటించాలి. కానీ కొందరు మాత్రం నిర్లక్షం వీడక.. కరోనా వ్యాప్తికి కారకులు అవుతున్నారు. అలాంటి వారిని ఆశ్చర్య పోయేలా చేశారు అనంతపురం జిల్లాలోని పెనుకొండ తహసీల్దారు.
ఇదీ చదవండి : చెక్ పోస్టు పడ్డాది రమణా.. ఏపీకి వచ్చే వారికి అలర్ట్... బోర్డర్ దగ్గర పడిగాపులు
నిర్లక్ష్యంతో కరోనా కు గురై ప్రజలు చనిపోతున్నా మాస్కులు లేకుండా.. సొంత వాహనాలలో ప్రయాణిస్తున్న వారిని చూసిన సోమందేపల్లి మండల తహసీల్దార్ సురేషకుమార్,, వెంటనే వారిని ఆపి మందలించకుండా వారికి చేతులు ఎత్తి మొక్కారు.. మాస్కులు వేసుకోండి మహా ప్రభో అంటూ వేడుకున్నారు. పెనుకొండ సబ్ కలెక్టర్, కోవిడ్ అధికారి నిశాంతి ఐఏఎస్ ఆదేశాల తో.. మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఎమ్మార్వో సురేష్ కుమార్ కర్ఫ్యూ తీరును పరిశీలించేందుకు రోడ్డుపైకి వెళ్లారు.
ఇదీ చదవండి : తెలుగు రాష్ట్రాలో కరోనా ఉద్ధృతికి ఈ వేరియంట్ కారణం. బీ కేర్ ఫుల్ అంటున్న శాస్త్రవేత్తలు
అదే సమయంలో మండలంలోని చాకార్లపల్లి, బ్రహ్మణపల్లి, చాలకురు గ్రామాలలో తెరిచి ఉన్న చికెన్, బార్బర్ సెలూన్, ఇతర షాపుల నిర్వాహకుల దగ్గరకు వెళ్లి ఆయన అవగాహన కల్పించారు. దయచేసి సమయానికి మూసేయండని.. రేపటి నుంచి తెరిచి ఉంచితే భారీ జరిమానా విధించడంతో పాటు శిక్షలు వేస్తామని హెచ్చరించారు. అలాగే రోడ్డుపై మాస్కులు లేకుండా కొందరు ప్రయాణికులు కనిపించారు. వారి వాహనాలను నిలిపి చేతులెత్తి మొక్కి మాస్కులు పెట్టుకోవాలని వేడుకున్నారు. దీంతో ఆయన చెప్పిన విధానంతో సిగ్గు పడ్డ అంతా అప్పటికప్పుడు మాస్కులు ధరించి.. ఎమ్మార్వోకు క్షమాపణలు చెప్పారు. ప్రస్తుతం ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.