Horoscope today on 19-4-2021: ప్లవ నామ సంవత్సరంలో రాశిఫలాలు చాలా వరకూ మంచిగానే ఉన్నాయి. కొన్ని రాశుల వారికి చిన్నపాటి ఇబ్బందులు ఉంటున్నాయి. ఏ రోజున ఏ రాశి ఫలం ఎలా ఉందో తెలుసుకోవడం ద్వారా... రాబోయే సమస్యల్ని ముందుగానే కనిపెట్టేందుకు కొంతవరకూ వీలవుతుందని జ్యోతిష పండితులు చెబుతున్నారు. ఇందుకోసం వారు గ్రహాలు, సూర్యుడు, తిథి, నక్షత్రం, పంచాంగం, ఘడియలు అన్నీ పరిశీలించి ప్రతి రోజూ రాశిఫలాలు ఇస్తున్నారు. మరి 19-4-2021 నాడు ఏయే సూచనలు చేస్తున్నారో చూద్దాం. తద్వారా ఏవైనా అనుకోని విపత్కర ఘటనలు జరిగేలా ఉంటే ముందుగానే జాగ్రత్త పడవచ్చు.
మేష రాశి (Aries)
ఒక కుటుంబ సమస్య నుంచి బయటపడతారు. సుఖసంతోషాలతో గడుపుతారు. ఆరోగ్యం మీద శ్రద్ధ పెంచాలి. పరువు ప్రతిష్ఠలు పెరుగుతాయి. ఉద్యోగరీత్యా కొన్ని మంచి వార్తలు వింటారు. వ్యాపారంలో లాభాలు నిలకడగా ముందుకు సాగుతాయి. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు తీసుకోండి.
వృషభ రాశి (Taurus)
ముఖ్యమైన పనుల్లో శ్రద్ధ పెంచాలి. అనుకూలమైన సమయం ఇది. అవరోధాలు ఆటంకాలు తొలగుతాయి. ఆర్థికంగా కలిసి వస్తుంది. ఉద్యోగంలో ఇబ్బందులు ఎదురవుతాయి. వ్యాపారంలో లాభాలు ఆర్జిస్తారు. ఆరోగ్యం కాపాడుకోవాలి. పని ఒత్తిడి ఉంటుంది. చెడు ఆలోచనలను దగ్గరకి రానివ్వవద్దు.
మిథున రాశి (Gemini)
తలచిన పనులు పూర్తవుతాయి. ఉద్యోగ సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇంటా బయటా శుభమే జరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో అభివృద్ధి ఉంటుంది. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి. వివాదాలకు ఇది సమయం కాదు. విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంది.
కర్కాటక రాశి (Cancer)
పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగంలో అధికారుల ప్రోత్సాహం లభిస్తుంది. వ్యాపారంలో, ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. ఇంటి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. బాధ్యతను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. అందరికీ మేలు జరిగే పనులు చేస్తారు. మానసిక ప్రశాంతత చేకూరుతుంది.
సింహ రాశి (Leo)
ఉద్యోగ, వివాహపరంగా మీరు చేస్తున్న ప్రయత్నాలు సఫలం అవుతాయి. ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. ఉద్యోగంలో అధికారుల సహాయ సహకారాలు లభిస్తాయి. దగ్గరి బంధువుతో ఆనందంగా గడుపుతారు. వ్యాపారపరంగా శ్రమ ఎక్కువవుతుంది. పలుకుబడి పెరుగుతుంది. హామీలు ఉండొద్దు.
కన్య రాశి (Virgo)
ఆర్థికంగా శుభ ఫలితాలు ఉన్నాయి. ఉద్యోగంలో ప్రశాంత వాతావరణం ఉంటుంది. వ్యాపారంలో శ్రద్ధ అవసరం. సొంత నిర్ణయాల వల్ల మేలు జరుగుతుంది. కుటుంబపరంగా సమస్యలు ఉన్నా ధైర్యంగా ఎదుర్కొంటారు. స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. ప్రారంభించిన పనుల్లో పురోగతి ఉంటుంది.
తుల రాశి (Libra)
ఆర్థిక స్థితి బాగా మెరుగుపడుతుంది. ఉద్యోగంలో సమర్థవంతంగా పని చేస్తారు. అవసరానికి ధనం లభిస్తుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నమ్మించి మోసగించే వారితో జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. మిత్రుల సహకారంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు.
వృశ్చిక రాశి (Scorpio)
ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. బంధుమిత్రుల సాయంతో ఓ వ్యక్తిగత సమస్యను పరిష్కరించుకుంటారు. గతంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తాయి. ఉద్యోగ బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తారు. వ్యాపారులకు సమయం అనుకూలంగా ఉంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త.
ధనస్సు రాశి (Sagittarius)
ధైర్యంగా నిర్ణయాలు తీసుకుని పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగంలోనూ, వ్యాపారంలోనూ విపరీతమైన ఒత్తిడి ఉంటుంది. ఆర్థిక స్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపారంలో శ్రమకు తగిన ప్రతిఫలం ఉంటుంది. అపార్థాలకు అవకాశం ఇవ్వవద్దు. ఓ కుటుంబ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ఆరోగ్యం పరవాలేదు.
మకర రాశి (Capricorn)
ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న శుభవార్త వింటారు. ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ప్రభుత్వపరంగా మేలు జరుగుతుంది. ముఖ్యమైన పనులు జాగ్రత్తగా పూర్తి చేస్తారు. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో సత్ఫలితాలను ఇస్తాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో విజయాలు అనుభవానికి వస్తాయి.
కుంభ రాశి (Aquarius)
ఒక ముఖ్యమైన కుటుంబ సమస్య పరిష్కారం అవుతుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాల్లో విజయం చేకూరుతుంది. సొంత నిర్ణయాలు మేలు చేస్తాయి. అన్నిటా సానుకూల వాతావరణం నెలకొని ఉంది. వ్యాపారంలో మాత్రం కాస్త జాగ్రత్త అవసరం. పెళ్లి సంబంధం ఖాయమవుతుంది.
ఇది కూడా చదవండి: House number personality: మీ హౌస్ నంబర్ ఆధారంగా మీ పర్సనాలిటీ తెలుసుకోండి
మీన రాశి (Pisces)
ఆర్థిక స్థితి క్రమంగా మెరుగవుతుంది. వృత్తిలో బాగా ఒత్తిడి ఉంటుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో కలిసి వస్తుంది. అనవసర ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. గతంలో తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తాయి. తలపెట్టిన పనులు చాలావరకు పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల సలహాలు పాటించండి.