VISAKHAPATNAM STATE BANK OF INDIA ONE BRANCH CLOSED IN VISAKHAPATNAM SOME EMPLOYEES REPORTED CORONA POSITIVE NGS
Andhra Pradesh: ఎస్‌బీఐ ఖాతాదారులకు షాక్. కరోనా కారణంగా బ్యాంక్ సేవలు నిలిపివేత?
విశాఖపట్నంలో కరోనా కారణంగా మూతపడ్డ ఎస్‌బీఐ బ్రాంచ్
కరోనా కాటు అన్ని రంగాలపై పడుతోంది. ఏపీపై కరోనా రక్కసి పంజా విసురుతోంది. రోజు రోజుకూ కరోనా కేసులు ఊహించని రీతిలో రెట్టింపు అవుతున్నాయి. కరోనా కారణంగా ఎస్‌బీఐ బ్రాంచ్ మూసేయాల్సిన పరిస్థితి నెలకొంది.
ఏపీని కరోనా అంతకంతకూ భయపెడుతోంది. రోజు రోజుకూ కేసుల సంఖ్య రెట్టింపు అవుతున్నాయి. 20 రోజుల క్రితం వరకు వందల్లో ఉన్న కరోనా కేసులు ఇప్పుడు రికార్డు స్థాయికి చేరుతున్నాయి. 24 గంటల్లోనే ఆరు వేల మార్కు దాటింది. ప్రస్తుతం నమోదవుతున్న కేసుల సంఖ్య చూస్తే త్వరలోనే పది వేల మార్కును అందుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. కేవలం కేసులు మాత్రమే కాదు. మరణాల సంఖ్య కూడా పెరుగుతుండడం కలవర పెడుతోంది.
దీనిపై ఇప్పటికే ప్రభుత్వం అప్రమత్తమై కరోనా కట్టడి చర్యలపై కసరత్తు చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ ఆస్పత్రుల సంఖ్య పెంచడంతోపాటు. ప్రస్తుతం ఉన్న ఆస్పత్రుల్లో బెడ్ ల సంఖ్య పెంచాలని పదే పదే ప్రభుత్వ స్పష్టం చేసింది. అలాగే ప్రైవేటు ఆస్పత్రుల్లో ఫీజుల నియంత్రణపై ఫోకస్ చేసింది. దీనికి తోడు తాజాగా పెరుగుతున్న కేసుల నేపథ్యంలో ఇంటింటి సర్వే చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.
ప్రభుత్వం కట్టడిపై ఫోకస్ చేస్తున్నా కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. గ్రామలతో పోలిస్తే పట్టణాల్లో పాజిటివ్ బారిన పడిన వారి సంఖ్య రెట్టింపుగా ఉంది. తొలిదశతో పోల్చితే సెకెండ్ వేవ్ మరింత ప్రమాదంగా కనిపిస్తోంది. కరోనా సోకిన వారిలో కొత్త కొత్త లక్షణాలు కనిపిస్తున్నాయి. కరనో వచ్చిందని గుర్తించే లోపే ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. మరోవైపు అంత్యంత వేగంగా మనిషి నుంచి మనిషికి వ్యాప్తి చెందుతోంది.
మళ్లీ కరోనా కాటు వేస్తోందని ప్రజలు గుర్తించినా ఇంకా చాలాచోట్ల నిర్లక్ష్యం వీడడం లేదు. దీంతో బయటకు వెళ్లిన చాలామంది మాస్కు లేకుండానే కనిపిస్తున్నారు. భౌతిక దూరం మాటే మరిచిపోయారు. ప్రజల నిర్లక్ష్యమే చాలాచోట్ల కరోనా వ్యాప్తికి కారణమవుతోంది. ఇప్పటికే చాలాచోట్ల లాక్ డౌన్ నాటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఏపీలో ఉత్తరాంధ్రలో ఒకప్పుడు చాలా తక్కువ కేసులు ఉండేవి. విశాఖ మినహా, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు గ్రీన్ జోన్ లుగా ఉండేవి.. కానీ ఇఫ్పుడు మూడు జిల్లాల్లో మహమ్మారి కోరలు చాచుతోంది. విజయనగరం జిల్లాలోని కురపాంలో స్వచ్ఛందంగా లాక్ డౌన్ అమలు చేసే పరిస్థితి నెలకొంది.
ఈ కరోనా ప్రభావం బ్యాంకులపైనా పడింది. విశాఖపట్నంలోని స్నేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓ బ్రాంచ్ లో సేవలు నిలిపివేయాల్సిన పరిస్థితి తలెత్తింది. శ్రీహరిపురంలోని ఎస్‌బీఐ బ్రాంచిలోని సిబ్బంది కరోనా బారిన పడడంతో తాత్కాలికంగా ఆ శాఖను మూసేశారు. ఈ మేరకు ఆ బ్యాంక్ షెట్టర్‌పై మూసివేతకు సంబంధించిన నోటీస్ అతికించారు. అయితే ఆ విషయం తెలియని వారు బ్యాంక్ వరకు వెళ్లి.. ఆ బోర్డు చూసి షాక్ తింటున్నారు. ఇటీవల ఆ బ్యాంక్ పనిమీద వెళ్లిన వారందరిలో టెన్షన్ మొదలైంది. ఇటీవల బ్యాంక్ కు వెళ్లాము అందులో సిబ్బందిని కలిశాము మరి మా పరిస్థితి ఏంటని భయపడుతున్నారు. కరోనా టెస్టుల కోసం పరుగులు తీస్తున్నారు. చాలా వరకు బ్యాంకుల్లో ఒకరిద్దరు కరోనా బారిన పడినట్టు తెలుస్తోంది. ఈ విస్తరణ ఇలాగే ఉంటే దాదాపు అన్ని బ్యాంకులు ఇలాంటి పద్ధతినే అనుసరించే ప్రమాదం ఉంది.