TIRUPATI WHO KILLED BABAI TDP LEADER CHANDRA BABU NAIDU QUESTIONED AP CM JAGAN MOHAN REDDY TPT NGS
Andhra Pradesh: కట్టప్పను ఎవరు చంపారో తెలిసింది? మరి బాబాయ్ ను చంపింది ఎవరు?
వైఎస్ వివేకానంద రెడ్డి, వైఎస్ జగన్
కట్టప్పను ఎవరు హత్య చేశారు అన్నదానికి సమాధానం దొరికింది. మరి ఏపీ సీఎం సొంత బాబాయ్ ను చంపింది ఎవరు? అన్నదానికి సమాధానం ఏపీ ప్రభుత్వమే చెప్పాలని టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు.
తిరుపతి ఉప ఎన్ని ప్రచారం ముగిసింది. ఎక్కడి మైకులు అక్కడే మూగబోయాయి. బయట నుంచి వచ్చిన లీడర్లంతా ఎక్కడివారు అక్కడకే వెళ్లి పోయారు. ఇక ఎన్నికకు సమయం దగ్గర పడుతోంది. అయితే వైసీపీ ఎంపీ అభ్యర్థి గురు మార్తి మతం విషయంపై దుమారం రేగుతోంది. ఇప్పటికే బీజేపీ నేతలు దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు కూడా స్పందించారు. బీజేపీ ఆరోపణలను పరిగణలోకి తీసుకుని.. వైసీపీ ఎంపీ అభ్యర్థి గురుమూర్తి మతం విషయంలో స్పష్టత ఇవ్వాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. గురు మూర్తి బీసీ కిందకు వస్తారనే వాదన ఉంది. మరి ఆయన్ను ఎస్సీ రిజర్వడ్ సీటులో ఎలా పోటీలో నిలిపారని వైసీపీ నేతలను ప్రశ్నించారు.
హూ కిల్ల్ డ్ బాబాయ్ అంటే సమాధానం లేదని.. బాహుబలిని చంపింది కట్టప్ప అని తేలిపోయింది కానీ.. సీఎం సొంత బాబాయ్ ని ఎవరు చంపారో మాత్రం తెలియక పోవడం దారుణమన్నారు చంద్రబాబు. సీబీఐ అధికారులైనా నిజాలను నిగ్గు తీయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. లేకపోతే సీబీఐ సంస్థే బ్రష్టు పడుతుందని అభిప్రాయపడ్డారు. జగన్ పరిపాలనలో ఎస్ సీలకు రెండేళ్లలో ఇది ఇచ్చాము అని చెప్పగలరా అని ప్రశ్నించారు. అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీ.. మేనిఫెస్టోలో చెప్పిన మద్య పాన నిషేధం ఎప్పుడు పెడతారు అని చంద్రబాబు నిలదీశారు.
ప్రజలను నవ మోసాలు చేసి పాలన సాగిస్తున్నారని.. బీసీ లకు కార్పొరేషన్ పదవులు ఇచ్చామన్నారు. కనీసం వారికి బెంచీ కుర్చీలు కూడా ఇవ్వలేదని ఎద్దేవ చేశారు. తాగిన వ్యక్తి కి బస్ డ్రైవింగ్ ఇచ్చినట్టు.. జగన్ చేతికి రష్ట్రాన్ని ఇచ్చామని ఆవేదన వ్యక్తం చేశారు. దేవినేని ఉమను కాదు. తిరుపతి పై వ్యాఖ్యలు చేసిన జగన్ అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఉప ఎన్నిక సందర్భంగా స్థానిక పోలీసులపై నమ్మకం పోయిందని.. అందుకే కేంద్ర బలగాలు దించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఓటరు రెండు గుర్తింపు కార్డులను చూపించాకే ఓటు వేసే అవకాశం కలిపించాలని.. లేదంటే అధికార పార్టీ దొంగ ఓట్లు వేయించే అవకాశం ఉందన్నారు. భూతుల మంత్రికి పనబాక లక్ష్మిని విమర్శించడానికి నోరు ఎలా వచ్చిందని చంద్రబాబు ప్రశ్నించారు.
తిరుపతి సభలో రాళ్లు పడలేదని డీఐజీ ఎలా చెపుతారని చంద్రబాబు నిలదీశారు. నిజంగా సీఎంకు మానవత్వం ఉంటే చనిపోయిన బల్లి దుర్గా ప్రసాద్ కుటుంబంలో వ్యక్తికి ఎందుకు టికె ఎందుకు టికెట్ ఇవ్వలేదని నిలదీశారు. కనీసం బల్లి దుర్గా ప్రసాద్ చనిపోతే ఆ రోజు సీఎం ఎందుకు రాలేదన్నారు.