OXYGEN SCARCITY IN ANDHRA PRADESH FOR COVID 19 PATIENTS WHO TREATED IN HOSPITALS AK
Andhra Pradesh: ఏపీ కోవిడ్ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరత.. చేతులేత్తేసిన స్టీల్ ప్లాంట్
ప్రతీకాత్మకచిత్రం
CoronaVirus: ఆక్సిజన్‌కు డిమాండ్ పెరగడంతో వాటి ధర కూడా భారీగా పెరిగింది. ఇక ఆక్సిజన్ సిలిండర్లు రీ-ఫిల్లింగ్‌కు ఏజెన్సీలు ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నాయి.
దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతుండటంతో.. పేషెంట్లకు ఆక్సిజన్ కొరత ఏర్పడుతోంది. దీంతో కరోనా చికిత్స అందిస్తున్న ఆస్పత్రల్లో ఆక్సిజన్ నిల్వలు తగ్గిపోతున్నాయి. గతేడాది కరోనా ఆస్పత్రులకు 120 టన్నుల ఆక్సిజన్‌ను విశాఖ స్టీల్ ప్లాంట్ సరఫరా చేసింది. లాక్‌డౌన్ వల్ల ఉత్పత్తి నిలిపివేయడంతో గతంలో ఆ స్థాయిలో ఆక్సిజన్‌ను ఆస్పత్రులకు స్టీల్ ప్లాంట్ సరఫరా చేసింది. అయితే ప్రస్తుతం వంద టన్నులకు మించి ఆక్సిజన్ ఇవ్వలేమని స్టీల్ ప్లాంట్ స్పష్టం చేసింది. దీంతో ఆక్సిజన్‌కు పెరిగిన విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. మరోవైపు ఆక్సిజన్ కొరత ఏర్పడుతుందని ముందే గ్రహించిన కేజీహెచ్ ఆస్పత్రి వర్గాలు.. 13, 20 టన్నుల భారీ ఆక్సిజన్ ట్యాంకర్ల ఏర్పాటు చేసుకున్నాయి.
ఇక విజయవాడ ఆస్పత్రుల్లోనూ ఆక్సిజన్ కొరత ఏర్పడుతోంది. డిమాండ్‌కు తగ్గస్థాయిలో ఏజెన్సీలు ఆక్సిజన్‌ను సరఫరా చేయలేకపోతున్నాయి. 50 మందికి డిమాండ్ ఉంటే 20 మందికి మాత్రమే ఏజెన్సీలు ఆక్సిజన్‌ను సరఫరా చేస్తున్నాయి. కరోనా, ఇతర వ్యాధులు, హోం ఐసొలేషన్ పేషెంట్ల నుంచి ఆక్సిజన్‌కు డిమాండ్ ఏర్పడింది. ఆక్సిజన్‌కు డిమాండ్ పెరగడంతో వాటి ధర కూడా భారీగా పెరిగింది. ఇక ఆక్సిజన్ సిలిండర్లు రీ-ఫిల్లింగ్‌కు ఏజెన్సీలు ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నాయి. 5 లీటర్లకు రూ. 15 వేలు, పది లీటర్లకు రూ. 20 వేలు వరకు ఏజెన్సీలు వసూలు చేస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు వ్యాక్సిన్‌తో పాటు ఆక్సిజన్ కొరత కూడా తీర్చాలని ఏపీ ప్రభుత్వం కేంద్రాన్ని కోరనున్నట్టు తెలుస్తోంది.