
- News18 Telugu
- Last Updated: April 14, 2021, 15:29 IST
వైఎస్ షర్మిల చేపట్టనున్న నిరాహార దీక్షకు పోలీసుల అనుమతి లభించింది. రేపు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటలవరకు దీక్షకు అనుమతి ఇచ్చారు. దీంతో రేపు ఇందిరాపార్క్ వద్ద ఆమె ఒక్కరోజు దీక్ష కూర్చోనున్నారు.నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించాలని కోరుతూ ఒక్కరోజు దీక్షకు కూర్చోనుంది. ఇటివలే ఖమ్మం సభలో తెలంగాణ ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేసిన షర్మిల మరో ప్రాణం పోకముందే ప్రభుత్వం స్పందించి ఉద్యోగాలు కల్పించాలని ఆమె ఖమ్మం సభలో డిమాండ్ చేశారు. దీంతోపాటు తెలంగాణ ప్రభుత్వ అవినీతి అక్రమాలను ప్రశ్నించేందుకు పార్టీ ఏర్పాటు చేస్తున్నట్టు ఆమె ప్రకటించిన విషయం తెలిసిందే..ఇందులో భాగంగానే ఇందిరా పార్క్ వద్ద దీక్ష చేసేందుకు మూడు రోజుల
అనుమతిని కోరారు..అయితే పోలీసులు మాత్రం ఒక్కరోజు దీక్ష మాత్రమే అనుమతి ఇచ్చారు.