TMC+BJP+INC+LEFT
100-12020-4080-9050-55

294SEATS (148SEATS TO WIN)

TMC+BJP+INC+OTH
80-9050-6010-2030-35

234SEATS (118SEATS TO WIN)

BJP+INC+AIADMKOTH
50-5540-5010-2010

140SEATS (71SEATS TO WIN)

BJP+INC+OTH
45-6512-1925

126SEATS (64SEATS TO WIN)

BJP+INC+CPM
10-152015

30SEATS (16SEATS TO WIN)

west-bengalASSEMBLY ELECTIONS 2021

55/294 SEATS (147 SEATS TO WIN)

Alliance TMCBJPLEFT+OTH
Wins
+
Leads
126734055
+/- 2015

55/294 SEATS

(148 SEATS TO WIN)

tamil-naduASSEMBLY ELECTIONS 2021

52/234 SEATS (117 SEATS TO WIN)

Alliance AIADMK+DMK+AMMK+MNM+OTH
Wins
+
Leads
3959513352
+/- 2015

52/234 SEATS

(118 SEATS TO WIN)

keralaASSEMBLY ELECTIONS 2021

16/140 SEATS (70 SEATS TO WIN)

Alliance LDFUDFBJP+OTH
Wins
+
Leads
56373116
+/- 2015

16/140 SEATS

(71 SEATS TO WIN)

assamASSEMBLY ELECTIONS 2021

24/126 SEATS (63 SEATS TO WIN)

Alliance BJP+INC+OTH
Wins
+
Leads
505224
+/- 2015

24/126 SEATS

(64 SEATS TO WIN)

puducherryASSEMBLY ELECTIONS 2021

19/30 SEATS (15 SEATS TO WIN)

Alliance INC+BJP+OTH
Wins
+
Leads
9219
+/- 2015

19/30 SEATS

(16 SEATS TO WIN)

BOAT Xplorer: బోట్ నుంచి సరికొత్త స్మార్ట్​వాచ్​ లాంఛ్​... ధర, ఫీచర్స్ వివరాలు ఇవే

BOAT Xplorer | ప్రముఖ ఎలక్ట్రానిక్ కంపెనీ బోట్ ఎక్స్‌ప్లోరర్ పేరుతో స్మార్ట్‌వాచ్‌ను లాంఛ్ చేసింది. ఈ స్మార్ట్ వాచ్ ఫీచర్స్, ధర తెలుసుకోండి.

BOAT Xplorer: బోట్ నుంచి సరికొత్త స్మార్ట్​వాచ్​ లాంఛ్​... ధర, ఫీచర్స్ వివరాలు ఇవే
BOAT Xplorer: బోట్ నుంచి సరికొత్త స్మార్ట్​వాచ్​ లాంఛ్​... ధర, ఫీచర్స్ వివరాలు ఇవే (image: Boat)

ప్రముఖ ఎలక్ట్రానిక్​ పరికరాల తయారీ సంస్థ బోట్ తన వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా అప్​డేటెడ్​ టెక్నాలజీతో కొత్త డివైజెస్​ను విడుదల చేస్తుంది. తాజాగా, ఈ టెక్ దిగ్గజం ‘‘బోట్ ఎక్స్‌ప్లోరర్‌” పేరుతో బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్​వాచ్​ను భారత మార్కెట్​లోకి విడుదల చేసింది. కేవలం రూ. 2,999లకే అద్భుతమైన ఫీచర్లను అందించింది. బడ్జెట్​ ధరలోనే దీనిలో ఇంటర్నల్​ జిపిఎస్, 24x7 హృదయ స్పందన ట్రాకర్, స్వెట్​ రెసిస్టన్స్​ వంటి ఫీచర్లను చేర్చింది. ఈ సరికొత్త స్మార్ట్​వాచ్​ విడుదలపై బోట్​ కోఫౌండర్​ అమన్​ గుప్తా మాట్లాడుతూ ‘‘భారతీయ యువతను ఆకట్టుకోవడంలో బోట్​ ఎప్పుడూ ముందుంటుంది. యువతను దృష్టిలో పెట్టుకొనే బడ్జెట్ ధరలో బోట్​ ఎక్స్​ప్లోరర్​ స్మార్ట్​వాచ్​ను విడుదల చేశాం. ఇది పిచ్ బ్లాక్, గ్రే, ఆరెంజ్ ఫ్యూజన్ అనే మూడు పట్టీ రంగులలో అందించబడుతుంది. ప్రస్తుతం రూ.3,000 లోపు మార్కెట్​లో లభిస్తున్న మిగతా స్మార్ట్​వాచ్​లతో పోలిస్తే ఫిట్‌నెస్, స్టైల్, పర్సనలైజేషన్ పరంగా ఇది అద్భుతంగా పనిచేస్తుంది." అని అన్నారు.

Samsung Galaxy A32: ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.3,000 తగ్గింది... రూ.1,500 డిస్కౌంట్ కూడా

LG Wing: ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.40,000 తగ్గింది... లేటెస్ట్ రేట్ ఎంతంటే

అద్భుతమైన ఫీచర్లు

బోట్​ ఎక్స్​ప్లోరర్​ స్మార్ట్​ వాచ్​లో​ పర్ఫార్మెన్స్​, డిజైన్​ పరంగా అద్భుతమైన ఫీచర్లను జోడించింది. ఇది పర్సనలైజ్డ్​ క్లౌడ్ వాచ్ ఫేస్‌లను అందిస్తుంది. దీనిలో చదరపు ఆకారంలో గల డయల్ మెటల్ బాడీ, 5ATM స్వెట్​, వాటర్​ రెసిస్టన్స్ వంటివి అందించింది. డిజైన్ పరంగా చూస్తే, ఈ వాచ్​కు సిలికాన్ పట్టీలు, క్లౌడ్ వాచ్ ఫేసెస్, UI కంట్రోలింగ్​ సైడ్-మౌంటెడ్ క్రౌన్​ వంటి ఫీచర్లను జోడించింది. ఇది 240x240 పిక్సెల్స్ స్క్రీన్ రెజల్యూషన్ గల1.3 -అంగుళాల హెచ్​డీ కలర్​ టచ్​ డిస్​ప్లేను అందిందింది. అంతేకాక, డౌన్​లోడెబుల్​ క్లౌడ్​ బేస్డ్​ వాచ్​ ఫేసెస్​, బ్లూటూత్​ 4.2 వైబ్రేషన్​ అలర్ట్స్,​ హార్ట్​ రేట్​ ట్రాకింగ్​, వెల్​నెస్​ మోడ్​, స్లీప్​ హార్ట్​ రేట్​, మెనుస్ట్రుయేషన్​ సైకిల్​ ట్రాకర్ వంటి అద్భుతమైన ఫీచర్లను చేర్చింది. వీటితో పాటు​ రన్నింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్ వంటి ఎనిమిది స్పోర్ట్స్ మోడ్‌లలో ఇది పనిచేస్తుంది. ఈ 8 మోడ్​ల ద్వారా మీ పర్ఫార్మెన్స్​ను ట్రాక్​ చేయవచ్చు. అదే విధంగా సంగీతాన్ని నియంత్రించవచ్చు, కాల్స్​, సోషల్ మీడియా మెసేజెస్​ అలర్ట్స్​ను స్వీకరించవచ్చు. ఇక, బ్యాటరీ పరంగా చూస్తే బోట్​ ఎక్స్​ప్లోరర్​లో 210mAh బ్యాటరీని అందించింది. ఇది మాగ్నెటిక్ ఛార్జింగ్​తో పనిచేస్తుంది. దీన్ని ఒక్కసారి ఛార్జ్​ చేస్తే 7 నుండి 10 రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్​ అందిస్తుంది. అంతేకాక, 30 రోజుల వరకు స్టాండ్​బై సమయాన్ని ఇస్తుంది. కనెక్టివిటీ ఫీచర్ల పరంగా చూస్తే దీనిలో బ్లూటూత్ 4.2, ఇన్​బిల్ట్​ GPS సెన్సార్‌ సపోర్ట్​ను అందించింది.

Poco X3 Pro: రూ.18,999 విలువైన స్మార్ట్‌ఫోన్ ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌తో రూ.2,499 ధరకే కొనండి ఇలా

WhatsApp: మీరు వాట్సప్ గ్రూప్ అడ్మిన్‌గా ఉన్నారా? ఈ కొత్త ఫీచర్ మీకోసమే

ధర, లభ్యత

భారత మార్కెట్​లో బోట్ ఎక్స్‌ప్లోరర్​ను కేవలం రూ. 2,999లకే అందుబాటులోకి తెచ్చింది. దీని అమ్మకాలను బోట్​ అధికారిక వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్ ద్వారా ప్రారంభించింది. ఈ స్మార్ట్​వాచ్​పై ఒక సంవత్సరం పాటు వారంటీని కూడా అందిస్తుంది.

Published by:Santhosh Kumar S
First published:April 19, 2021, 15:41 pm