
- News18 Telugu
- Last Updated: April 19, 2021, 08:07 IST
Muttiah Muralitharan: సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ కోచ్ ముత్తయ్య మురలీధరన్‌కి సడెన్‌గా గుండె సంబంధిత సమస్య రావడంతో ఆయన్ని... చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేర్చారు. ఏప్రిల్ 17నే ఆయన 49వ ఏట అడుగుపెట్టారు. పుట్టిన రోజు జరిగిన రెండు రోజులకే ఈ అనారోగ్య సమస్య రావడం క్రికెట్ ప్రపంచానికి ఆందోళన కలిగించింది. ప్రస్తుతం ఈ హాఫ్ స్పిన్నర్... అపోలో ఆస్పత్రిలోనే ఉన్నారు. తమిళ న్యూస్ ఛానెల్స్ థంతీ టీవీ, పుథియా తలైమురై ప్రకారం... మురళీధరన్‌కు గుండె సమస్య కాస్త పెద్దగానే వచ్చింది. అందువల్ల ఆయనకు యాంజియోప్లాస్టీ (angioplasty) చేయబోతున్నట్లు తెలిసింది. మురళీధరన్... 2015 నుంచి IPLలో సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌కి కోచ్‌గా ఉంటున్నారు. ఆ టీమ్ బలాబలాలన్నీ ఆయనకు తెలుసు.
టెస్టుల్లో 800 వికెట్లు తీసిన ఘనత ముత్తయ్యదే. ప్రపంచంలో మరే ప్లేయర్ ఇన్ని వికెట్లు తియ్యలేదు. అందువల్ల ఆ రికార్డ్ ఆయన పేరు మీదే ఉంది. ఐతే... క్రికెట్‌లో ఆయన వేసిన బౌలింగ్‌పై మొదట్లో విమర్శలు, ఆరోపణలు వచ్చాయి. శ్రీలంక క్రికెట్‌లో అడుగు పెట్టినప్పుడు... ఆయన బౌలింగ్ యాక్షన్ చూసి అంతా షాక్ అయ్యారు. అదేంటి అలా వేస్తున్నాడు అని అనుమానించారు. ప్రపంచ క్రికెట్ నుంచి ఆయన్ని తప్పించేంత దాకా వెళ్లింది ఆ వివాదం. ఐతే... ఇలాంటి వివాదాలన్నింటినీ ఎదుర్కొంటూ... ముత్తయ్య మురళీధరన్... ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాడు. ఇప్పుడు వరల్డ్ క్రికెట్‌లో మురళీధరన్ వేసే బౌలింగ్ దూస్రా (“doosra”) కూడా ఓ పార్ట్ అయిపోయింది. 1996 వరల్డ్ కప్ గెలిచిన కెప్టెన్ అర్జున రణతుంగ... పదేళ్లపాటూ... లంకలో తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్‌తో... మురళీ ధరన్‌కు ఫుల్లుగా మద్దతిచ్చాడు. తద్వారా మురళీ అంచలంచెలుగా ఎదుగుతూ... ఇప్పుడు క్రికెట్ లెంజెడ్స్‌లో ఒకడిగా నిలిచాడు.
\1\6ఇది కూడా చదవండి: NASA - Mars: నేడు మార్స్‌పై ఎగరనున్న నాసా హెలికాప్టర్... ఏంటి దాని ప్రత్యేకత...
ముత్తయ్య మురళీధరన్... వన్డే ఇంటర్నేషనల్స్ (ODIs)లో కూడా 534 వికెట్లు తీశాడు. అంతేకాదు... 66 మ్యాచుల్లో 63 వికెట్లు కుప్పకూల్చాడు. అలాంటి ఆయన ఆస్పత్రి పాలవడంతో... క్రికెట్ అభిమానులు ఒకింత ఆందోళన చెందుతున్నారు.