west-bengalASSEMBLY ELECTIONS 2021

294/294 SEATS (148 SEATS TO WIN)

Alliance TMCBJPLEFT+OTH
Wins
+
Leads
127833351
+/- 2015

294/294 SEATS

(148 SEATS TO WIN)

tamil-naduASSEMBLY ELECTIONS 2021

234/234 SEATS (118 SEATS TO WIN)

Alliance AIADMK+DMK+AMMK+MNM+OTH
Wins
+
Leads
887542254
+/- 2015

234/234 SEATS

(118 SEATS TO WIN)

keralaASSEMBLY ELECTIONS 2021

140/140 SEATS (71 SEATS TO WIN)

Alliance LDFUDFBJP+OTH
Wins
+
Leads
4366247
+/- 2015

140/140 SEATS

(71 SEATS TO WIN)

assamASSEMBLY ELECTIONS 2021

126/126 SEATS (64 SEATS TO WIN)

Alliance BJP+INC+OTH
Wins
+
Leads
683622
+/- 2015

126/126 SEATS

(64 SEATS TO WIN)

puducherryASSEMBLY ELECTIONS 2021

30/30 SEATS (16 SEATS TO WIN)

Alliance INC+BJP+OTH
Wins
+
Leads
8193
+/- 2015

30/30 SEATS

(16 SEATS TO WIN)

YS Sharmila: టీఆర్ఎస్‌కు గట్టి షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్న షర్మిల ?

YS Sharmila: తన రాజకీయ ప్రస్థానాన్ని ఖమ్మం నుంచే ప్రారంభించిన షర్మిల... జిల్లాలోని పాలేరు నుంచి పోటీ చేస్తానని గతంలోనే ప్రకటించారు.

YS Sharmila: టీఆర్ఎస్‌కు గట్టి షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్న షర్మిల ?

    తెలంగాణలో రాజకీయ పార్టీ ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతున్న వైఎస్ షర్మిల.. అంతకంటే ముందే రాజకీయంగా ప్రజల్లోకి వెళ్లేందుకు వివిధ మార్గాలను అన్వేషిస్తున్నారు. ఈ క్రమంలోనే ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలంటూ నిరాహార దీక్ష చేసేందుకు సిద్ధమయ్యారు. ఇదిలా ఉంటే జూలైలో రాజకీయ పార్టీ పేరుతో పాటు జెండా, అజెండాను ప్రకటిస్తానని తెలిపిన షర్మిల.. అంతకంటే ముందే తమ పార్టీని రాజకీయంగా యాక్టివ్ చేసే పనిలో ఉన్నారని.. ఇందుకోసం ఖమ్మం మున్సిపల్ ఎన్నికలను ఆమె ఉపయోగించుకోబోతున్నారనే టాక్ వినిపిస్తోంది. త్వరలోనే వరంగల్, ఖమ్మంతో పాటు పలు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కానుందని వార్తలు వస్తున్నాయి. ఎన్నికలు జరగనున్న ప్రాంతాల్లో అధికార పార్టీ నేతల పర్యటనలను బట్టి చూస్తుంటే.. త్వరలోనే ఇందుకు సంబంధించిన నోటిపికేషన్ రావడం ఖాయమనే చర్చ జరుగుతోంది.

    మిగతా చోట్ల పరిస్థితి ఎలా ఉన్నా.. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మాత్రం తమ పార్టీ మద్దతుదారులను బరిలోకి దింపితే ఎలా ఉంటుందనే దానిపై వైఎస్ షర్మిల యోచిస్తున్నారని తెలుస్తోంది. తన రాజకీయ ప్రస్థానాన్ని ఖమ్మం నుంచే ప్రారంభించిన షర్మిల... జిల్లాలోని పాలేరు నుంచి పోటీ చేస్తానని గతంలోనే ప్రకటించారు. ఆ రకంగా ఖమ్మం జిల్లాలో తన పార్టీ మరింత బలంగా ఉండాలని ఆమె కోరుకుంటున్నారని సన్నిహితులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మద్దతుదారులను బరిలోకి దింపాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది.

    ఈ మేరకు షర్మిల మద్దతుదారులు సైతం ఆమెపై ఒత్తిడి తీసుకొస్తున్నారని.. ముందుగానే ఎన్నికల రంగంలోకి దిగితే పార్టీ సత్తా ఏంటో తెలుస్తుందని ఆమెకు చెప్పారని సమాచారం. అయితే షర్మిల పెట్టబోయే పార్టీకి ప్రత్యేకించి ఎన్నికల గుర్తు లేకపోయినప్పటికీ.. ఆమె మద్దతుదారులంతా స్వతంత్ర్య అభ్యర్థులుగా పోటీ చేసే అవకాశం లేకపోలేదని చర్చ జరుగుతోంది. మొత్తానికి ఖమ్మం జిల్లాలో రాజకీయంగా ఎదగాలని భావిస్తున్న షర్మిల.. పార్టీ పెట్టడానికి ముందే ఎన్నికల్లో తమ మద్దతుదారులను బరిలోకి దింపుతారా లేక వేచి చూసే ధోరణి అవలంభిస్తారా అన్నది ప్రస్తుతానికి సస్పెన్సే.

    Published by:Kishore Akkaladevi
    First published:April 14, 2021, 23:04 IST