
- News18 Telugu
- Last Updated: April 19, 2021, 12:30 IST
Indian Railways: దేశంలో కరోనా కేసులు రోజూ 2న్నర లక్షలకు పైగా నమోదవుతుంటే... ఆక్సిజన్ సిలిండర్లకు కొరత బాగా ఏర్పడింది. అస్సలు దొరకట్లేదు. ఒక్క సిలిండర్ అయినా ఉంటే ఇమ్మంటూ... ఆస్పత్రుల్లో డాక్టర్లే... సరఫరా దారుల దగ్గరకు వచ్చి బతిమలాడుకుంటున్నారు. ఈ పరిస్థితుల మధ్య భారతీయ రైల్వే శాఖ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ (Oxygen Express)లను వచ్చే కొన్ని రోజులపాటూ నడపబోతున్నట్లు తెలిపింది. ఈ ఎక్స్‌ప్రెస్‌లలో ప్రయాణికులు ఉండరు. సరుకులు కూడా ఉండవు. వీటిలో లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్, ఆక్సిజన్ సిలిండర్లు ఉంటాయి. ఈ రైళ్లు దేశంలోని నలుమూలలకూ వెళ్లి... ఆక్సిజన్, ఆక్సిజన్ సిలిండర్లను చేరవేస్తాయి. ఆల్రెడీ ఖాళీ ట్యాంకర్లు... ఆక్సిజన్ లిక్విడ్ నింపుకునేందుకు... కలంబోలీ, బోయిసార్ రైల్వే స్టేషన్ల నుంచి బయలుదేరాయి. ఇవి విశాఖపట్నం, జంషెడ్‌పూర్, రూర్కెలా, బొకారోకి వెళ్లి... ఆక్సిజన్ నింపుకుంటాయి. ఈ నిండిన ట్యాంకర్లను గూడ్స్ రైళ్లపై పెడతారు. అవి... ఆయా రాష్ట్రాలకు చేరతాయి.
ఇలా రైళ్లలో ఆక్సిజన్ సప్లై చెయ్యమని మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు... రైల్వేశాఖను కోరాయి. రైళ్లలో అయితే... వేగంగా సప్లై అవుతాయని చెప్పడంతో... రైల్వే శాఖ వెంటనే ఒప్పుకుంది. టెక్నికల్‌గా ఇలా ఆక్సిజన్ సరఫరా చెయ్యడానికి వీలవుతుందా అని గమనించింది. పెట్రోల్, పాల వంటివి సప్లై చేస్తున్నప్పుడు... ఇవి కూడా చెయ్యవచ్చు అనిపించి రెడీ అయ్యింది. ఇప్పుడు రోడ్లపై ఆక్సిజన్ తీసుకెళ్లే ట్యాంకర్లు... ఇకపై రైళ్లపై సెట్ అవుతాయి.
ఈ ఖాళీ ట్యాంకర్లు నేడు ఆయా రాష్ట్రాల్లోని ఆక్సిజన్ సప్లై కేంద్రాలకు చేరుతున్నాయి. వీటిలో ఆక్సిజన్ నింపగానే... త్వరలోనే రైళ్లు బయల్దేరతాయి. ఇందుకు కొన్ని రోజులు పట్టొచ్చని అంటున్నారు. కచ్చితంగా ఎన్ని రోజులో చెప్పట్లేదు. ఏప్రిల్ 17న రాష్ట్రాల్లోని ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్లతో రైల్వే శాఖ సమావేశం నిర్వహించింది. అందులో లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్‌ను రైళ్లపై తరలించేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పింది. రాష్ట్రాలు ఓకే చెప్పాయి. కాబట్టి వీలైనంత త్వరగా రైళ్లపై ఆక్సిజన్ ట్యాంకర్లను తరలిస్తారని మనం అనుకోవచ్చు.
\1\6పరిశ్రమలకు నో ఆక్సిజన్:
ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం మరో మంచి నిర్ణయం తీసుకుంది. దేశంలోని పరిశ్రమలకు ఆక్సిజన్ సప్లైని రద్దు చేసింది. ఏప్రిల్ 22 నుంచి ఇది అమల్లోకి వస్తుంది. ప్రస్తుతం మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో ఆక్సిజన్ సిలిండర్లకు విపరీతమైన డిమాండ్ ఉంది. విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి ఉత్పత్తి అవుతున్న సిలిండర్లు డైరెక్టుగా మహారాష్ట్ర వెళ్లిపోతున్నాయి. రాన్రానూ డిమాండ్ పెరుగుతుంటే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. అందువల్ల ఇన్నాళ్లూ ఆక్సిజన్‌తో నడిచిన పరిశ్రమలకు ఈ నిర్ణయం ఇబ్బంది కలిగించేదే అయినప్పటికీ... కరోనా రోగుల ప్రాణాల కంటే ఏదీ ఎక్కువ కాదు కాబట్టి... కేంద్ర నిర్ణయాన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు ఆమోదిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: No Mask Video: మాస్క్ లేకుండా యువతి... పోలీసులతో గొడవ... ఏం చేస్తారు అంటూ ఫైర్
India Corona: భారత్‌లో కొత్తగా 2,73,810 కరోనా కేసులొచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 1,50,61,919కి చేరింది. కొత్తగా 1,619 మంది చనిపోవడంతో... మొత్తం మరణాల సంఖ్య 1,78,769కి చేరింది. దేశంలో మరణాల రేటు 1.2 శాతానికి పెరిగింది. తాజాగా 1,44,178 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 1,29,53,821కి చేరింది. రికవరీ రేటు 86 శాతానికి పడిపోయింది. ప్రస్తుతం దేశంలో 19,29,329 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా కొత్తగా 13,56,133 మందికి కరోనా పరీక్షలు చేశారు. భారత్‌లో ఇప్పటి వరకు 26 కోట్ల 78 లక్షల 94వేల 549 టెస్ట్‌లు చేశారు. కొత్తగా 12,30,007 మందికి వ్యాక్సిన్ వేశారు. ఇప్పటివరకు 12 కోట్ల 38 లక్షల 52వేల 566 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు.