
- News18 Telugu
- Last Updated: April 14, 2021, 17:20 IST
ఈ రోజుల్లో మానవ సంబంధాలకు విలువ ఇచ్చేవారు తగ్గిపోతున్నారు. మానవ సంబంధాలు ఎప్పుడు ఎలా మారతాయో తెలియకుండానే కొంతమంది జీవితాలు కోనసాగుతాయి. ఊహించని సంఘటనలతో జీవితాలు మారిపోతున్నాయ్. రోజు రోజుకూ మానవ సంబంధాలు ఎలా మంట కలిసిపోతున్నాయి అనడానికి ఇదో ఉదాహరణ. కలికాలం.. అనాలో ఇంకేం అనాలో అర్ధంకాని పరిస్థితి ఒక్కో విషయం వింటే అనిపిస్తుంది. అటువంటి విషయమే ఇది. వయసుకు వచ్చిన తన బిడ్డను పెళ్లి చేసుకుంటానంటూ ఒకరు కోర్టుకు వెళ్లడం ఇప్పుడు అందరికీ షాకిచ్చింది. కన్న తల్లిదండ్రులు.. తోబుట్టువులు ఒకరినొకరు పెళ్లిచేసుకోవడం.. లైంగిక సంబంధం పెట్టుకోవడం చట్టరీత్యా నేరం. అనైతికం. అయినప్పటికీ కోర్టుకు అందిన ఒక లేఖ ఇప్పుడు అందర్నీ షాకింగ్ కు గురిచేస్తోంది. అది చూసిన న్యాయమూర్తులు అవాక్కయ్యారు. ఇంతకీ ఆ లేఖలో ఏముందంటే.. తాను వయస్సుకు వచ్చిన తన బిడ్డను పెళ్లి చేసుకుంటాను అని రాసి ఉంది. అసలు ఇలా కన్న బిడ్డను పెళ్లి చేసుకోవాలనే ఆలోచన ఎలా వచ్చింది అంటూ వారు ఫైరవుతున్నారు. ఈ ఘటన న్యూయార్క్ లో చోటు చేసుకుంది. మన్హాట్ ఫెడరల్ కోర్టులో ఈ లేఖ విచారణకు వచ్చింది. కానీ, ఈ లేఖ రాసిన వ్యక్తి తాను ఆ బిడ్డకు తల్లా? తండ్రా అనే విషయాల్ని తెలియపర్చలేదు.
అదేవిధంగా ఆ బిడ్డ ఆడా..మగా అనేది కూడా పేర్కొలేదు. కానీ, ఈ ఉత్తరం సామాజికంగా అనైతిక చర్య.. జీవశాస్త్ర పరంగా చాలా అశ్యకరమైన చర్య అని దీన్ని ఆమోదిస్తే సమాజానికి తప్పుడు సంకేతాలు వెళతాయంటూ కోర్టులో అనేక మంది తీవ్రంగా వ్యతిరేకత వ్యక్తం చేశారు. "ఇద్దరు వ్యక్తులు ఎలాంటి సంబంధం కలిగివున్నా.. వివాహమనే శాస్వత బంధంతో మరింత సాన్నిహిత్యంగా, ఆధ్యాత్మికంగా గడపవచ్చు" అని ఆ పిటీషన్‌లో ఉంది. అయితే, ఆ పిటీషన్‌లో కనీసం వారు నివసిస్తున్న ప్రాంతం పేరును కూడా రాయలేదు. వారి మధ్య ప్రస్తుతం ఎలాంటి బంధం ఉందనేది కూడా స్పష్టంగా ఇవ్వలేదు.
అసలు ఈ లేఖ రాసిన వారు ఎందుకోసం పెళ్లి చేసుకోవాలని కుంటున్నారు? లైంగిక జీవితం కోసమా? లేక మరేదైనా కారణం ఉందా అనేది కూడా తెలియరాలేదు. అయితే, ఈ లేఖరాసిన వారు తాము పెద్ద వయసువారిమే అని పేర్కొన్నారు. మొత్తమ్మీద ఈ లేఖ ఉదంతం న్యూయార్క్ లో సంచలనం సృష్టించింది. ఇప్పుడు ఈ లేఖ పెద్ద హాట్ టాపిక్ గా మారింది. మొత్తానికి ఈ లేఖతో మానవ సంబంధాలపై మరో సారి అనుమానాలు ఉత్పన్నమయ్యాయ్.