Samsung Galaxy M12: ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి ఇటీవల సాంసంగ్ గెలాక్సీ ఎం12 రిలీజైంది. ఇందులో 6,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ 4జీబీ+64జీబీ, 6జీబీ+128జీబీ వేరియంట్లలో రిలీజ్ అయింది. 4జీబీ+64జీబీ ధర రూ.10,999 కాగా, 6జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.13,499. సాంసంగ్ గెలాక్సీ ఎం12 స్పెసిఫికేషన్స్ చూస్తే 6.5 అంగుళాల హెచ్డీ+ టీఎఫ్టీ ఇన్ఫినిటీ వీ డిస్ప్లే ఉంది. సాంసంగ్ ఎక్సినోస్ 850 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.