1. Jio 249 Prepaid Plan: రిలయెన్స్ జియో రూ.249 రీఛార్జ్ చేస్తే రోజూ 2జీబీ డేటా వాడుకోవచ్చు. వేలిడిటీ 28 రోజులు. అంటే మొత్తం 56 జీబీ డేటా ఉపయోగించుకోవచ్చు. రోజూ 2జీబీ డేటా ఉపయోగించిన తర్వాత కూడా అన్లిమిటెడ్ డేటా వాడుకోవచ్చు. కానీ స్పీడ్ 64కేబీపీఎస్‌కు తగ్గిపోతుంది. అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఉచితం. రోజూ 100 ఎస్ఎంఎస్లు వాడుకోవచ్చు. జియోటీవీ, జియోసినిమా, జియో న్యూస్, జియో సెక్యూరిటీ, జియో క్లౌడ్ జియో యాప్స్‌తో పాటు ఇతర సబ్స్క్రిప్షన్స్ కూడా లభిస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)