ప్రముఖ స్ట్రీమింగ్ సర్వీసు యాప్‌లన్నీ ఇందులో అందుబాటులో ఉంటాయి. అమెజాన్ ప్రైమ్, హాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్, యాపిల్ టీవీ, యూట్యూబ్ యాప్‌లు ముందుగా డౌన్లోడ్ అయి ఉంటాయి. ఈ క్యూబ్ కీలక ఆప్షన్‌గా హ్యాండ్స్ ఫ్రీ అలెక్సా వాయిస్ అసిస్టెంట్‌ను చెప్పొచ్చు. క్యూబ్‌లోని స్పీకర్, మైక్రోఫోన్ ఎప్పుడూ ఆన్‌లో ఉంటాయి. మీరు ‘అలెక్సా’ అనే పదం అనగానే యాక్టివ్ అయిపోతుంది. అప్పుడు మీకు కావాల్సిన ఓటీటీ/సర్వీసును చెప్పి టీవీలో ప్లే చేయొచ్చు. టీవీ క్యూబ్‌తో దానికి మందుగా కనెక్ట్ చేసి ఉన్న టీవీని ఆన్/ఆఫ్ కూడా చేయొచ్చు.