ప్రపంచాన్ని భయపెట్టించిన కరోనా మహమ్మారి ప్రభావం ఇంకా పూర్తిగా పోలేదు. లాక్డౌన్ తరువాత సాధారణ పరిస్థితులు నెలకొన్నప్పటికీ సినిమా థియేటర్లు, జిమ్‌లు, రెస్టారెంట్లు, మార్కెట్లు వంటి రద్దీ ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రజలు భయపడుతూనే ఉన్నారు. దీనికి తోడు COVID-19 మన జీవన శైలిపై ఎంతో ప్రభావం చూపింది. ఆహారం, వ్యాయామం విషయంలో ప్రజలు జాగ్రత్తగా ఉంటున్నారు. జిమ్‌లలో క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలనుకునే వారికి కరోనా పెద్ద అడ్డంకిగా మారింది. కానీ తీవ్రత ఎక్కువగా ఉండే హై ఇంటెన్సిటీ వర్కవుట్లను ఇంట్లోనే సులభంగా చేసుకోవచ్చు.