డీహైడ్రేషన్: సాధారణ పనులు చేయడానికి కూడా మీ శరీరానికి తగిన నీరు లేకపోతే ఆ లక్షణాన్ని డీహైడ్రేషన్ అని అంటారు. దాహం దీని ప్రధాన లక్షణం. ఎక్కువగా వ్యాయామం, విరేచనాలు, వాంతులు, వికారం, చెమటలు పట్టడం లాంటివి దీనికి కారణం కావచ్చు. ఇందు కోసం ముందుగా రోగి మూత్రం రంగును గమనించండి. మూత్రం ముదురు పసుపు రంగులో ఉండటం, నోరు ఎండిపోవడం, పొడి చర్మం, తలనొప్పితో పాటు పిల్లలు ఏడుస్తున్నప్పుడు కన్నీళ్లు రాకపోవడం, మందగింపు, డైపర్లలో తడి లేకపోవడం లాంటివి దీని లక్షణాలు. (ప్రతీకాత్మక చిత్రం)