మహిళల్లో వయస్సు పెరిగే కొద్ది పీరియడ్స్ తగ్గిపోతాయి. ఈ సమయంలో వారి శరీరంలో అనేక మార్పులు వస్తాయి. తరచుగా చెమటలు పట్టడం, చికాకు వంటి సమస్యలు వస్తుంటాయి. అంతేకాక, పీరియడ్స్ ఆగిపోతే అండాశయాలు పూర్తిగా తగ్గి గర్భాధారణ సమస్యలు వస్తుంటాయి. ఫలితంగా, శరీరంలో ఈస్ట్రోజన్ హార్మోన్ లెవల్ కూడా పడిపోతుంది. ఈ కారణంగా శరీరం కాస్త వేడిగా మారే అవకాశం కూడా ఉంది. అంతేకాక, వారిలో ఆందోళన పెరగడం, కోపం, ఒత్తిడి వంటి సమస్యలు అధికమవ్వడం వంటివి జరుగుతుంటాయి. ఇవన్నీ కూడా మెనోపాజల్ లక్షణాలుగా చెప్పొచ్చు.