కరోనా నేపథ్యంలో దేశ వ్యాప్తంగా వివిధ పరీక్షలు వాయిదా పడుతున్న విషయం తెలిసిందే. మరి కొన్ని ఎగ్జామ్స్ రద్దు కూడా అవుతున్నాయి.(ప్రతీకాత్మక చిత్రం)
ఈ నేపథ్యంలో మే 16 నుంచి 30 వ తేదీ వరకు గుంటూరులోని బ్రహ్మానందరెడ్డి స్టేడియంలో నిర్వహించ తలపెట్టిన ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీని వాయిదా వేశారు.(ప్రతీకాత్మక చిత్రం)
ఈ మేరకు గుంటూరు స్టెప్ సీఈఓ డాక్టర్ శ్రీనివాస రావు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. కరోనా కారణంగా ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీని వాయిదా వేసినట్లు చెప్పారు.(ప్రతీకాత్మక చిత్రం)
అయితే ఈ నెల 30 వరకు షెడ్యూల్ ప్రకారం దరఖాస్తులు స్వీకరిస్తామని ఆయన స్పష్టం చేశారు. అయితే ర్యాలీకి సంబంధించిన తేదీలను తర్వాత వెల్లడిస్తామని ఆయన చెప్పారు.(ప్రతీకాత్మక చిత్రం)
అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు 30వ తేదీలోగా www.joinindianarmy.nic.in వెబ్ సైట్లో రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు మాత్రమే తర్వాత నిర్వహించనున్న ర్యాలీలో పాల్గొనడానికి అర్హులని ఆయన స్పష్టం చేశారు.(ప్రతీకాత్మక చిత్రం)
గుంటూరు, ప్రకాశం, కర్నూలు, అనంతపూర్, కడప, నెల్లూరు, చిత్తూరు జిల్లాల అభ్యర్థులు ఈ ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీకి హాజరుకావొచ్చు.(ప్రతీకాత్మక చిత్రం)