ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి మరో ఉద్యోగ ప్రకటన విడుదలైంది. అపోలో ఫార్మసీలో ఉద్యోగాల భర్తీకి రిక్రూట్మెంట్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు సంస్థ తెలిపింది.(ప్రతీకాత్మక చిత్రం)
ఈ ప్రకటన ద్వారా మొత్తం 100 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 20న నిర్వహించనున్న ఇంటర్వ్యూలకు హాజరు కావాలని ప్రకటనలో పేర్కొన్నారు.(ప్రతీకాత్మక చిత్రం)
అభ్యర్థులు https://apssdc.in/industryplacements/ ఈ లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ కు ఆఖరి తేదీ ఈ నెల 18. ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు కృష్ణ, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో పని చేయాల్సి ఉంటుంది.(ప్రతీకాత్మక చిత్రం)
ఫార్మసిస్ట్ విభాగంలో 50 ఖాళీలు ఉన్నాయి. బీ ఫార్మసీ, ఎం ఫార్మసీ, డీ ఫార్మసీ విద్యార్హతతో పాటు PCI సర్టిఫికేట్ ఉన్న వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసేందుకు అర్హులు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ.11500 నుంచి రూ. 15 వేల వరకు వేతనం చెల్లించనున్నారు. ఇతర ఇన్సెంటీవ్స్ ను సైతం అందిస్తారు.(ప్రతీకాత్మక చిత్రం)
ఫార్మసీ అసిస్టెంట్: ఈ విభాగంలో 30 ఖాళీలు ఉన్నాయి. టెన్త్ నుంచి డిగ్రీ వరకు విద్యార్హత కలిగిన వారు ఈ ఉద్యోగాలకు అర్హులు. మెడికల్ రిటైల్ విభాగంలో అనుభవం ఉండాలి. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ. 10 వేల నుంచి రూ.20 వేల వరకు వేతనం చెల్లించనున్నారు.(ప్రతీకాత్మక చిత్రం)
ఫార్మసీ ట్రైనీ విభాగంలో 20 ఖాళీలు ఉన్నాయి. టెన్త్ నుంచి డిగ్రీ విద్యార్హత కలిగిన వారు ఈ ఉద్యోగాలకు అర్హులు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ.9500 వేతనం చెల్లించనున్నారు. ఇతర ఇన్సెంటీవ్స్ ను సైతం అందించనున్నారు.(ప్రతీకాత్మక చిత్రం)
ఈ ఉద్యోగాలకు ఈ నెల 20న career Walk, Opp: Congress Party Office, Beside Raj Towers, Eluru Road, Governorpet, Vijayawada, CRDA Region చిరునామాలో ఇంటర్వ్యూ నిర్వహించనున్నారు.(ప్రతీకాత్మక చిత్రం)
అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ రోజు ఉదయం 10 గంటలకు పైన తెలిపిన చిరునామాలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు వార్షిక బోనస్, పీఎఫ్, ఈఎస్ఐ సదుపాయాలు ఉంటాయి.(ప్రతీకాత్మక చిత్రం)