1. ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్-APSSDC వరుసగా జాబ్ నోటీస్‌లను జారీ చేస్తోంది. మెట్రో క్యాష్ అండ్ క్యారీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌లో భారీగా ఉద్యోగాల భర్తీకి సంబంధించిన వివరాలను ట్విట్టర్లో వెల్లడించింది APSSDC. (ప్రతీకాత్మక చిత్రం)
2. గుంటూరు జిల్లా మంగళగిరి రోడ్డులోని మెట్రో క్యాష్ అండ్ క్యారీ సూపర్ మార్కెట్లో ఈ ఉద్యోగాలనున్నాయి. మొత్తం 350 ఖాళీలను భర్తీ చేస్తోంది మెట్రో. ఇందులో సేల్స్ అసోసియేట్స్, క్యాషియర్, జీఆర్, వేర్‌హౌజ్, లాజిస్టిక్స్, కస్టమర్ అక్విజిషన్ అసోసియేట్ లాంటి పోస్టులున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
3. వీటిలో సేల్స్ అసోసియేట్స్, క్యాషియర్, జీఆర్, వేర్‌హౌజ్, లాజిస్టిక్స్ పోస్టులు 150 ఉండగా, కస్టమర్ అక్విజిషన్ అసోసియేట్ పోస్టులు 200 ఉన్నాయి. అభ్యర్థులు 2021 ఏప్రిల్ 20 లోగా రిజిస్ట్రేషన్ చేయాలి. (Source: APSSDC Twitter)
4. టెన్త్, ఇంటర్, డిగ్రీ పాస్ అయినవారు ఈ పోస్టులకు అప్లై చేయొచ్చు. కస్టమర్ అక్విజిషన్ అసోసియేట్ పోస్టులకు అప్లే చేసే అభ్యర్థులకు 2 వీలర్ తప్పనిసరిగా ఉండాలి. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. (ప్రతీకాత్మక చిత్రం)
5. ఎంపికైనవారికి ముందుగా 5 రోజులు శిక్షణ ఉంటుంది. సేల్స్ అసోసియేట్స్, క్యాషియర్, జీఆర్, వేర్‌హౌజ్, లాజిస్టిక్స్ పోస్టులకు నెలకు రూ.10,000, కస్టమర్ అక్విజిషన్ అసోసియేట్ పోస్టులకు నెలకు రూ.10,000 వేతనంతో పాటు రోజూ 200 అలవెన్సులు లభిస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)
6. అభ్యర్థులకు 2021 ఏప్రిల్ 22న ఇంటర్వ్యూలు ఉంటాయి. రిక్రూట్మెంట్ డ్రైవ్ జరిగే వేదిక: మెట్రో క్యాష్ అండ్ క్యారీ ప్రైవేట్ లిమిటెడ్, బెస్ట్ ప్రైస్ ఎదురుగా, మంగళగిరి రోడ్, మంగళ్‌దాస్ నగర్, గుంటూరు. (ప్రతీకాత్మక చిత్రం)