Covid 19 Updates: ఇండియాలో మొన్న 1,86,364 కొత్త కరోనా కేసులు రాగా.... నిన్న 1,73,790 వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 2,77,29,247కి చేరింది. కొత్తగా మొన్న 3,660 మంది చనిపోగా...నిన్న 3,617 మంది చనిపోయారు. మరణాల సంఖ్య కాస్త తగ్గినట్లే. మొత్తం మరణాల సంఖ్య 3,22,512కి చేరింది. దేశంలో మరణాల రేటు 1.2 శాతంగా ఉంది. ప్రపంచ దేశాల్లో ఇది 2.08 శాతంగా ఉంది. ఇండియాలో తాజాగా 2,84,601 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 2,51,78,011కి చేరింది. రికవరీ రేటు 90.8 శాతంగా ఉంది. రికవరీ రేటు మొన్న 90.3 శాతంగా ఉంటే... నిన్న 90.8 శాతానికి పెరగడం మంచి విషయం. ప్రస్తుతం భారత్లో 22,28,724 యాక్టివ్ కేసులు ఉన్నాయి. యాక్టివ్ కేసులు రోజూ లక్ష దాకా తగ్గుతున్నాయి. దేశవ్యాప్తంగా కొత్తగా 20,80,048 టెస్టులు చేశారు. భారత్లో ఇప్పటివరకు 34 కోట్ల 11 లక్షల 19 వేల 909 టెస్టులు చేశారు. కొత్తగా 30,62,747 మందికి వ్యాక్సిన్లు వేశారు. ఇప్పటివరకు 20కోట్ల 89లక్షల 02వేల 445మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు. (image credit - twitter)