India Corona: ఇండియాలో కొత్తగా 3,29,942 పాజిటివ్ కేసులు వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 2,29,92,517కి చేరింది. కొత్తగా 3,876 మంది చనిపోయారు. మొత్తం మరణాల సంఖ్య 2,49,992కి చేరింది. దేశంలో మరణాల రేటు 1.1 శాతంగా ఉంది. ప్రపంచ దేశాల్లో ఇది 2.08 శాతంగా ఉంది. ఇండియాలో తాజాగా 3,56,082 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 1,90,27,304కి చేరింది. రికవరీ రేటు 82.8 శాతంగా ఉంది. రికవరీ రేటు పెరుగుతుండటం మంచి విషయం. ప్రస్తుతం భారత్లో 37,15,221 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా నిన్న 18,50,110 టెస్టులు మాత్రమే చేశారు. భారత్లో ఇప్పటివరకు 30 కోట్ల 56 లక్షల 00వేల 187 టెస్టులు చేశారు. కొత్తగా 25,03,756 మందికి వ్యాక్సిన్లు వేశారు. ఇప్పటివరకు 17కోట్ల 27లక్షల 10వేల 066మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు. (image credit - twitter)