India Corona: ఇండియాలో కొత్తగా 3,43,144 పాజిటివ్ కేసులు వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 2,40,46,809కి చేరింది. కొత్తగా 4,000 మంది చనిపోయారు. మొత్తం మరణాల సంఖ్య 2,62,317కి చేరింది. దేశంలో మరణాల రేటు 1.1 శాతంగా ఉంది. ప్రపంచ దేశాల్లో ఇది 2.08 శాతంగా ఉంది. ఇండియాలో తాజాగా 3,44,776 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 2,00,79,599కి చేరింది. రికవరీ రేటు 83.5 శాతంగా ఉంది. రికవరీ రేటు పెరుగుతుండటం మంచి విషయం. ప్రస్తుతం భారత్లో 37,04,893 యాక్టివ్ కేసులు ఉన్నాయి. యాక్టివ్ కేసులు తగ్గుతున్నాయి. దేశవ్యాప్తంగా కొత్తగా 18,75,515 టెస్టులు చేశారు. భారత్లో ఇప్పటివరకు 31 కోట్ల 13 లక్షల 24వేల 100 టెస్టులు చేశారు. కొత్తగా 20,27,162 మందికి వ్యాక్సిన్లు వేశారు. ఇప్పటివరకు 17కోట్ల 92లక్షల 98వేల 584మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు. (image credit - twitter)