ఆంధ్రప్రదేశ్ లో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. ప్రతి రోజూ ఆందళనకర స్థాయిలో పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది.
రాష్ట్ర వ్యాప్తంగా గడచిన 24 గంటల్లో 35,907 శాంపిల్స్ ని పరీక్షించగా 7,224 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
జిల్లాల వారీగా కరోనా పాజిటివ్ కేసుల వివరాలు చూస్తే.. అనంతపురం జిల్లాలో 420, చిత్తూరు జిల్లాలో 1,051, తూర్పుగోదావరి జిల్లాలో 906, గుంటూరు జిల్లాలో 903, కడప జిల్లాలో 200, కృష్ణాజిల్లాలో 493, కర్నూలు జిల్లాలో 507, నెల్లూరు జిల్లాలో 624, ప్రకాశం జిల్లాలో 588, శ్రీకాకుళం జిల్లాలో 662, విశాఖపట్నం జిల్లాలో 470, విజయనగరం జిల్లాలో 304 పశ్చిమగోదావరి జిల్లాలో 96 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 9,55.455కి చేరింది. వీరిలో ఇప్పటివరకు 9,07,598 మంది డిశ్చార్జ్ అయ్యారు.
గడచిన 24 గంటల్లో 2,332 మంది డిశ్చార్జ్ అవగా.. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 40,469కి పెరిగింది.