HOME »
PHOTOGALLERY » CORONAVIRUS-LATEST-NEWS »
LIFE INSURANCE CORPORATION OF INDIA LIC POLICY COVERS COVID 19 DEATH CLAIMS KNOW ALL DETAILS SS
LIC Claims: కరోనాతో మరణిస్తే ఎల్ఐసీ పాలసీ క్లెయిమ్ చేసుకోవచ్చా?
LIC Policy Claims | కరోనాతో మరణిస్తే వారి కుటుంబ సభ్యులు ఎల్ఐసీ పాలసీ క్లెయిమ్ చేసుకోవచ్చా? ఈ అనుమానాలు చాలామందిలో ఉన్నాయి. దీనిపై గతంలోనే క్లారిటీ ఇచ్చింది ఎల్ఐసీ.
News18 Telugu | June 3, 2021, 9:39 AM IST
1/ 8
1. కరోనా సెకండ్ వేవ్ దేశవ్యాప్తంగా విజృంభిస్తోంది. కరోనా వైరస్ కారణంగా మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. అయితే కరోనాతో మరణిస్తే ఎల్ఐసీ పాలసీ వర్తిస్తుందా? లేదా? అన్న అనుమానాలు చాలామందిలో ఉన్నాయి. దీనిపై గతంలోనే లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా-LIC క్లారిటీ ఇచ్చింది. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 8
2. సాధారణ మరణాలు, ప్రమాదాల, అనారోగ్యం కారణంగా మరణాలతో పాటు కోవిడ్ 19 తో చనిపోయినా ఎల్ఐసీ పాలసీ వర్తిస్తుంది. మృతుల కుటుంబ సభ్యులు ఎల్ఐసీ పాలసీ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఈ విషయాన్ని గతంలోనే స్పష్టం చేసింది ఎల్ఐసీ. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 8
3. ఈ పాలసీ క్లెయిమ్ చేసుకునే ప్రాసెస్‌లో కూడా ఎలాంటి మార్పు లేదు. సాధారణంగా పాలసీ ఎలా క్లెయిమ్ చేసుకుంటారో కోవిడ్ 19 కారణంగా మరణించినవారి కుటుంబ సభ్యులు అదే పద్ధతిలో పాలసీ క్లెయిమ్ చేసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 8
4. పాలసీ తీసుకునే సమయంలో పాలసీ హోల్డర్ ఎవరి పేరును నామినీగా వెల్లడించారో, సదరు నామినీ క్లెయిమ్ డాక్యుమెంట్స్‌ని ఎల్ఐసీ ఆఫీసులో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఎల్ఐసీ నియమనిబంధనల ప్రకారమే పాలసీ క్లెయిమ్ ఉంటుంది. గతేడాది కూడా ఎల్ఐసీ భారీ సంఖ్యలో డెత్ క్లెయిమ్స్ సెటిల్ చేసింది. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 8
5. 2020-21 ఆర్థిక సంవత్సరంలో అంటే 2020 ఏప్రిల్ 1 నుంచి 2021 మార్చి 31 వరకు లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా-LIC మొత్తం 9,59,000 డెత్ క్లెయిమ్స్‌ను సెటిల్ చేసింది. మొత్తం రూ.18,137.34 కోట్లు డెత్ క్లెయిమ్స్ చెల్లించింది. వీటిలో కోవిడ్ 19 డెత్ క్లెయిమ్స్ కూడా ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 8
6. ఎల్ఐసీ పాలసీ హోల్డర్ కరోనాతో మరణిస్తే క్లెయిమ్ డాక్యుమెంట్లో కరోనా వైరస్ కారణంగా మరణించినట్టు నామినీ వెల్లడించాల్సి ఉంటుంది. డెత్ క్లెయిమ్ ఇంటిమేషన్, డెత్ సర్టిఫికెట్, పాలసీ కాపీని దగ్గర్లోని బ్రాంచ్ ఆఫీసులో సబ్మిట్ చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 8
7. దగ్గర్లో ఎల్ఐసీ కార్యాలయం లేకపోతే మెయిల్ ద్వారా కూడా ఈ డాక్యుమెంట్స్ పంపొచ్చు. లేదా ఆ పాలసీ అమ్మిన ఎల్ఐసీ ఏజెంట్‌ని సంప్రదించొచ్చు. ఎల్ఐసీ ఏజెంట్ డెత్ క్లెయిమ్ సెటిల్మెంట్కు సహకరిస్తారు. (ప్రతీకాత్మక చిత్రం)
8/ 8
8. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఎల్ఐసీ బ్రాంచ్‌లు, ప్రీమియం పాయింట్స్, కాల్ సెంటర్లు పాక్షికంగా సేవలు అందిస్తున్నాయి. ఆన్లైన్ సేవలు మాత్రం 24 గంటలు అందుబాటులో ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)