HOME »
PHOTOGALLERY » CORONAVIRUS-LATEST-NEWS »
IF PRADHAN MANTRI JEEVAN JYOTI BIMA YOJANA PMJJBY POLICY HOLDER DIES OF COVID 19 NOMINEE WILL GET RS 200000 INSURANCE AMOUNT SS
Insurance Scheme: కరోనాతో చనిపోయినవారి నామినీకి రూ.2,00,000... స్కీమ్ వివరాలివే
Insurance Scheme | కరోనా కారణంగా దేశంలో మరణించినవారి సంఖ్య మూడు లక్షలు దాటింది. కరోనాతో మరణించినవారు ఈ స్కీమ్‌లో ఉన్నట్టైతే నామినీకి రూ.2,00,000 బీమా వర్తిస్తుంది. స్కీమ్ వివరాలు తెలుసుకోండి.
News18 Telugu | June 4, 2021, 4:32 PM IST
1/ 9
1. ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన-PMJJBY... కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఇన్స్యూరెన్స్ పథకం ఇది. ప్రతీ ఏటా ఈ ఇన్స్యూరెన్స్ స్కీమ్‌లో డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. రూ.330 వార్షిక ప్రీమియం చెల్లించినవారికి రూ.2,00,000 ఇన్స్యూరెన్స్ వర్తిస్తుంది. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు కస్టమర్లు ఈ ఇన్స్యూరెన్స్ పథకంలో చేరేలా ప్రోత్సహిస్తున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 9
2. ఈ పాలసీలో అనేక మంది చేరారు కూడా. ప్రతీ ఏటా వారి అకౌంట్ల నుంచి ప్రీమియం కట్ అవుతుంది. అయితే ఈ పాలసీ ఉన్నట్టు కుటుంబ సభ్యులకు సమాచారం లేకపోవడం వల్ల బీమా ప్రయోజనాలు కోల్పోతున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా మరణించినవారికి ఈ పాలసీ ఉన్నట్టైతే వారి కుటుంబ సభ్యులు రూ.2,00,000 బీమా పొందొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 9
3. కరోనాతో మరణించినవారి కుటుంబ సభ్యులు ఆర్థికంగా చేయూత పొందేందుకు ఈ ఇన్స్యూరెన్స్ పథకం ఉపయోగపడుతుంది. అయితే ముందుగా కరోనాతో మరణించినవారు ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన ఇన్స్యూరెన్స్ తీసుకున్నారో లేదో తెలుసుకోవాలి. ప్రతీ ఏటా రూ.330 ప్రీమియం చెల్లిస్తున్నారో లేదో చెక్ చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 9
4. అంతేకాదు... ప్రీమియం పెండింగ్ లేకపోతేనే పాలసీ యాక్టీవ్‌గా ఉంటుంది. ఆ విషయాన్ని గుర్తించాలి. వారు ఈ ఇన్స్యూరెన్స్ తీసుకున్నట్టైతే కుటుంబ సభ్యులు క్లెయిమ్ కోసం దరఖాస్తు చేయొచ్చు. ఇందుకోసం నామినీ క్లెయిమ్ కోసం అప్లై చేయాలి. ముందుగా నామినీ సంబంధిత బ్యాంకును సంప్రదించాలి. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 9
5. కరోనాతో చనిపోయినవారి సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ వివరాలు చెప్పాలి. దాంతో పాటు డెత్ సర్టిఫికెట్ తప్పనిసరి. క్లెయిమ్ కోసం బ్యాంక్ అకౌంట్ వివరాలు కూడా ఇవ్వాలి. సంబంధిత అధికారులు దరఖాస్తును పరిశీలించి, అన్ని డాక్యుమెంట్స్ చెక్ చేసిన తర్వాత క్లెయిమ్ ప్రాసెస్ మొదలుపెడతారు. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 9
6. ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన పథకంలో 18 నుంచి 50 ఏళ్ల లోపు వారు ఎవరైనా చేరొచ్చు. 55 ఏళ్ల వరకు బీమా వర్తిస్తుంది. ఈ పాలసీ తీసుకున్నవారు బ్యాంకు అకౌంట్ నుంచి ప్రతీ ఏటా ప్రీమియం ఆటోమెటిక్‌గా చెల్లింపు జరిగేలా ఆటోడెబిట్కు అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 9
7. ప్రతీ ఏటా పాలసీ రెన్యువల్ అవుతుంది. జూన్ నుంచి మే వరకు పాలసీ వర్తిస్తుంది. ప్రతీ ఏటా మే 31న పాలసీ ముగుస్తుంది. ఒక్కసారి ఈ పాలసీలో చేరిన తర్వాత ప్రతీ ఏటా మే 25 నుంచి 31 మధ్య ప్రీమియం కట్ అవుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
8/ 9
8. జూన్ నుంచి ఆగస్ట్ మధ్య ఈ పాలసీ తీసుకుంటే రూ.330, సెప్టెంబర్ నుంచి నవంబర్ మధ్య తీసుకుంటే రూ.258, డిసెంబర్ నుంచి ఫిబ్రవరి మధ్య పాలసీ తీసుకుంటే రూ.172, మార్చి నుంచి మే మధ్య తీసుకుంటే రూ.86 ప్రీమియం చెల్లించాలి. (ప్రతీకాత్మక చిత్రం)
9/ 9
9. మూడు సందర్భాల్లో ఈ పాలసీ రద్దవుతుంది. పాలసీ తీసుకున్న వ్యక్తికి 55 ఏళ్లు పూర్తైనా, ప్రీమియం చెల్లింపు కోసం అకౌంట్లో బ్యాలెన్స్ లేకపోయినా, ఒకే వ్యక్తి వేర్వేరు అకౌంట్ల ద్వారా పాలసీ తీసుకున్నా పాలసీ రద్దవుతుంది. వేర్వేరు బ్యాంకుల ద్వారా పాలసీ తీసుకున్నా రూ.2,00,000 బీమా మాత్రమే వర్తిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)