Space Requirement: కుందేళ్ల పెంపకానికి స్థలం కావాలి. ఐతే... అది మరీ ఎక్కువ అక్కర్లేదు. మీరు చిన్నగా ఓ 50 కుందేళ్లు మాత్రమే పెంచదలిస్తే... అందుకు అవి పెరిగే సైజు కంటే... డబుల్ సైజు స్థలం సరిపోతుంది. అక్కడే చిన్న షెడ్... చెక్కలతో నిర్మించుకోవచ్చు. మీరు కుందేళ్ల పిల్లలను కొనేందుకు జస్ట్ ఓ రూ.4000 పెట్టుబడి పెట్టవచ్చు. కుందేళ్లు ఎండిన గడ్డి, క్యాబేజీ, క్యారెట్, కొత్తిమీర, క్యాలీఫ్లవర్ ఆకులు వంటివి ఇష్టంగా తింటాయి. ఈ ఆహారం తక్కువ రేటుకి దొరుకుతుంది. అదే... ఖర్చైనా పర్వాలేదు అనుకుంటే... ఖరీదైన ఆహారం కూడా కొనవచ్చు. కుందేళ్లకు శుభ్రమైన నీరు అవసరం. కానీ ఎక్కువ తాగవు. కుందేళ్లకు తగిన మందులు టైమ్ టు టైమ్ ఇస్తూ ఉంటే... అవి ఆరోగ్యంగా పెరుగుతాయి. (ప్రతీకాత్మక చిత్రం)