ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి ఉపఎన్నిక అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. శనివారం ఉదయమే పోలింగ్ ప్రారంభమైంది. చాలా చోట్ల ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
ఐతే పోలింగ్ సందర్భంగా దొంగఓట్ల వ్యవహారం కలకలం రేపుతోంది. తిరుపతిలో వేలాది మంది దొంగఓటర్లు ఉన్నారని టీడీపీ, బీజేపీలు ఆరోపిస్తున్నాయి.
పోలింగ్ కేంద్రాల వద్ద స్థానికేతరులున్నారని ఫేక్ ఐడీ కార్డులతో ఓట్లు వేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది.
దొంగఓట్ల ఆరోపణలను నిజం చేస్తూ కొంతమంది వద్ద ఫేక్ ఓటర్ కార్డులు దర్శనమిస్తున్నాయి. కొన్ని ఓట్ కార్డులపై ఫోటోలు, డోర్ నెంబర్లు లేకపోవడం అనుమానాలకు తావిస్తోంది. అలాగే ఓటర్ కార్డుల వెనుక స్టిక్కర్లు కూడా దర్శనమిస్తున్నాయి.