ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. సాధారణ జనంతో పాటు ప్రజాప్రతినిథులు కూడా కరోనా బారిన పడుతున్నారు.
తాజాగా గుంటూరు జిల్లా తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కరోనా బారిన పడ్డారు. ఇటీవల అస్వస్థతకు గురైన ఆమె టెస్టులు చేయించుకోగా పాజిటివ్ గా తేలింది.
[caption id="attachment_803520" align="alignnone" width="855"] ప్రస్తుతం ఎమ్మెల్యే శ్రీదేవి హైదరాబాద్ లోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఐతే కరోనా సోకినా ఆమె అశ్రద్ధ చేయడంతో ఉపిరితిత్తుల్లో సమస్య తీవ్రమైనట్లు వార్తలు వస్తున్నాయి. (ఫైల్ ఫోటో)