కరోనా సెకండ్ వేవ్ ప్రభావం తిరుమలపైనా పడింది. కరోనా నిబంధనలను టీటీడీ మళ్లీ కఠినతరం చేసింది. మరోవైపు భక్తులు కూడా తిరుమలకు వెళ్లేందుకు ఆలోచిస్తున్నారు. కరోనా కేసులు భారీగా పెరిగిన నేపథ్యంలో తిరుమల పర్యటనను వాయిదా వేసుకుంటున్నారు.(ప్రతీకాత్మక చిత్రం)
ఐతే ఇప్పటికే కొందరు భక్తులు ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఆన్లైన్లో బుక్ చేసుకున్నారు. కానీ కరోనా తీవ్రత కారణంగా తిరుమల వెళ్లేందుకు భయపడుతున్నారు. ఇలాంటి వారికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శుభవార్త చెప్పింది. (ప్రతీకాత్మక చిత్రం)
ఏప్రిల్ నెల 21 నుండి 30 వరకు తిరుమల దర్శనం కోసం ఆన్లైన్లో రూ. 300 టికెట్ బుక్ చేసుకున్న భక్తులు కోవిడ్ కారణంగా రాలేని పరిస్థితుల్లో.. రానున్న 90 రోజుల వరకు వారు దర్శన అవకాశాన్ని వినియోగించుకోవచ్చని టీటీడీ తెలిపింది. అంటే ఆ టికెట్ల మరో 90 రోజుల వరకు చెల్లుబాటు అవుతాయి. (ప్రతీకాత్మక చిత్రం)
గత కొన్ని రోజుల నుండి దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు పెరిగిన నేపథ్యంలో టీటీడీ కొన్ని నిర్ణయాలను తిరిగి అమలు లోనికి తీసుకు వచ్చింది. మళ్లీ కఠిన ఆంక్షలను విధిస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
ఇప్పటికే తిరుపతిలో సర్వదర్శనం టైం స్లాట్ టోకెన్లను జారీని టీటీడీ నిలిపివేసింది. దగ్గు, జలుబు వంటి అనారోగ్య సమస్యలతో బాధపడే భక్తులను తిరుమల యాత్రను వాయిదా వేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేసింది. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా కోవిద్ నియమాలను పాటించాలని స్పష్టం చేసింది. (ప్రతీకాత్మక చిత్రం)